Swastik Pipe IPO opens: స్వస్తిక్ పైప్ ఐపీఓ ప్రారంభం.. వివరాలివే-swastik pipe ipo opens for subscription today key things to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Swastik Pipe Ipo Opens For Subscription Today. Key Things To Know

Swastik Pipe IPO opens: స్వస్తిక్ పైప్ ఐపీఓ ప్రారంభం.. వివరాలివే

Praveen Kumar Lenkala HT Telugu
Sep 29, 2022 09:44 AM IST

Swastik Pipe IPO opens: స్వస్తిక్ పైప్ ఐపీఓ 62.52 లక్షల ఈక్విటీ షేర్ల సైజుతో నేడు ప్రారంభమైంది.

స్వస్తిక్ పైప్ ఐపీఓ ప్రారంభం
స్వస్తిక్ పైప్ ఐపీఓ ప్రారంభం (HT)

Swastik Pipe IPO opens: స్వస్తిక్ పైప్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) సెప్టెంబర్ 29, 2022న బిడ్డింగ్‌ కోసం ఓపెన్ అయ్యింది. అక్టోబర్ 03, 2022 సోమవారం ముగుస్తుంది. కంపెనీ NSEలో తన పబ్లిక్ ఇష్యూ కోసం ఈక్విటీ షేర్‌కి ప్రైస్ బ్యాండ్ రూ. 97 నుండి రూ. 100 గా నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

IPOలో బుక్-బిల్డింగ్ ప్రక్రియ ద్వారా పూర్తిగా చెల్లించిన ఒక్కో షేర్ రూ. 10 ముఖ విలువ కలిగిన 62.52 లక్షల వరకు ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. ఇష్యూలో యాభై శాతం హెచ్‌ఎన్‌ఐలకు రిజర్వ్ చేసింది. ఇష్యూ కోసం 50% రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసింది.

ఆగస్టు 31, 2022 నాటికి స్వస్తిక్ పైప్ పెండింగ్ ఆర్డర్ బుక్ స్థానం రూ. 300 కోట్లుగా ఉంది. ‘వర్కింగ్ క్యాపిటల్ అందుబాటులోకి రాగానే విలువ-ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెడుతుంది. కంపెనీ డైరెక్ట్-కార్పొరేట్, ఎగుమతి ఆదాయాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న 110 డీలర్‌షిప్ బేస్‌ని రెట్టింపు చేయడం ద్వారా ఉత్తర భారత మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని చూస్తున్నాం..’ అని స్వస్తిక్ పైప్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ బన్సల్ పెట్టుబడిదారుల బృందానికి తెలిపారు.

సందీప్ బన్సల్, అనుపమ బన్సల్, శాశ్వత్ బన్సల్, గీతా దేవి అగర్వాల్ ఆధ్వర్యంలోని స్వస్తిక్ పైప్ 1973 నుండి మైల్డ్ స్టీల్, కార్బన్ స్టీల్ ఎలక్ట్రిక్-రెసిస్టెన్స్-వెల్డెడ్ (ERW) బ్లాక్, గాల్వనైజ్డ్ పైపులు, ట్యూబ్‌లను తయారు చేసి ఎగుమతి చేస్తోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా, డీఎంఆర్‌సీ, ఈఐఎల్, హిందుస్తాన్ జింక్, ఎల్ అండ్ టీ, నాల్కో, ఎన్టీపీసీ, ఏబీబీ లిమిటెడ్ తదితర కంపెనీలు స్వస్తిక్ పైప్ క్లయింట్లుగా ఉన్నాయి.

కంపెనీ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) యొక్క SME ప్లాట్‌ఫారమ్‌లో లిస్టవుతాయని భావిస్తున్నారు. అర్హత కలిగిన చిన్న, మధ్యస్థ సంస్థల పోర్ట్‌ఫోలియో పనితీరును ప్రతిబింబించేలా నిఫ్టీ ఎస్‌ఎంఈ ఎమర్జ్ ఇండెక్స్ రూపొందించారు. షేర్ల కేటాయింపు కోసం తాత్కాలిక తేదీ 7 అక్టోబర్ 2022న ఉండవచ్చు. స్వస్తిక్ పైప్ షేర్ల లిస్టింగ్ తేదీ అక్టోబరు 12, 2022న ఉంటుంది.

IPL_Entry_Point

టాపిక్