Sunita Williams: సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే తేదీని ప్రకటించిన నాసా-sunita williams may return to earth on this date shares nasa in latest update ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sunita Williams: సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే తేదీని ప్రకటించిన నాసా

Sunita Williams: సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే తేదీని ప్రకటించిన నాసా

Sudarshan V HT Telugu
Published Feb 14, 2025 07:21 PM IST

Sunita Williams: సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉన్న తేదీని తాజాగా నాసా ప్రకటించింది. ముందు షెడ్యూల్ చేసిన తేదీ కన్నా ముందే మిషన్ ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ మార్చి నెల మధ్యలో భూమికి తిరిగి వస్తారని నాసా ప్రకటించింది.

బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ (ఫైల్ ఫొటో)
బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ (ఫైల్ ఫొటో) (HT_PRINT)

Sunita Williams: గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ తొలుత ఊహించిన దానికంటే ముందుగానే భూమికి తిరిగి రావచ్చని నాసా ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ వరకు కాకుండా మార్చి మధ్య వరకు వీరిద్దరు భూమికి తిరిగి వస్తారని అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. వ్యోమగాముల పునరాగమనాన్ని వేగవంతం చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల ఇచ్చిన హామీల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

పాత క్యాప్సూల్ లోనే..

రాబోయే వ్యోమగాముల కోసం క్యాప్సూల్స్ ను మార్చాలని నాసా, స్పేస్ఎక్స్ మొదట నిర్ణయించాయి. కానీ ఆ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. గత వారంతో సునీత విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకుని ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మానవ అంతరిక్షయానం తరచుగా ఊహించని సవాళ్లను తెస్తుందని అంగీకరించారు. వ్యోమగాములను త్వరగా ఇంటికి తీసుకురావడానికి ఈ సర్దుబాటు అవసరమని పేర్కొన్నారు. విల్మోర్, సునీతా విలియమ్స్ లు జూన్ లో బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ క్యాప్సూల్ లో వారం రోజుల పాటు విమాన ప్రదర్శన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, వారిని తీసుకురావాల్సిన క్యాప్సూల్ ఐఎస్ఎస్ కు చేరుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో, ఆ మిషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.

మార్చి 12 న మిషన్ స్టార్ట్స్

కొత్త క్యాప్సూల్ కోసం అవసరమైన అదనపు సన్నాహాల కారణంగా స్పేస్ఎక్స్ ఈ మిషన్ ను వాయిదా వేసింది. కొత్త క్యాప్సూల్ కోసం మరింత జాప్యం జరగనుండటంతో, నాసా ముందుగా ఉపయోగించిన స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ పై పంపాలని ఎంచుకుంది. తాజాగా ఈ మిషన్ ను మార్చి 12న ప్రారంభించనున్నారు. సునీత విలియమ్స్, విల్మోర్ లను తీసుకురావడానికి ఉద్దేశించిన క్యాప్సూల్ మార్చి 12వ తేదీన నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరిగి ఇద్దరు వ్యోమగాములతో మార్చి 19న భారత్ కు తిరిగివచ్చే అవకాశం ఉంది. సాధారణంగా, ఇప్పటికే ఐఎస్ఎస్ లో ఉన్న సిబ్బంది తిరిగి రాకముందే కొత్త సిబ్బంది అక్కడికి చేరుకునేలా నాసా ప్లాన్ చేస్తుంది. దానివల్ల ఐఎస్ఎస్ లో కార్యకలాపాల అప్పగింత సులభమవుతుంది.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.