Student Suicide: ఫీజు చెల్లించనందుకు పరీక్షకు అనుమతించని పాఠశాల! విద్యార్థిని ఆత్మహత్య-student dies by suicide after entry to exam hall denied in uttar pradesh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Student Dies By Suicide After Entry To Exam Hall Denied In Uttar Pradesh

Student Suicide: ఫీజు చెల్లించనందుకు పరీక్షకు అనుమతించని పాఠశాల! విద్యార్థిని ఆత్మహత్య

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 04, 2023 07:22 AM IST

Student Suicide: ఉత్తర ప్రదేశ్‍లో ఓ 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫీజు కట్టని కారణంగా పాఠశాల యాజమాన్యం తనను పరీక్షకు అనుమతించకపోవటంతో ఆమె మనస్తాపానికి గురైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Student Suicide in Uttar Pradesh: ఫీజు కట్టలేదంటూ ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఓ 9వ తరగతి విద్యార్థినిని పరీక్ష రాయకుండా అడ్డుకుంది. ఆ స్టూడెంట్‍ను స్కూల్‍లోకి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ 14 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‍లోని బరేలీ (Bareilly) జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Student Suicide in Uttar Pradesh: ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు బరేలీ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ భటీ తెలిపారు. విచారణకు ఆదేశించామని అన్నారు.

“స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో నా కూతురు తొమ్మిదో తరగతి చదువుతోంది. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను స్కూల్ ఫీజు కట్టలేకపోయాను” అని ఆ విద్యార్థిని తండ్రి అశోక్ కుమార్ తన ఫిర్యాదులో తెలిపారు. ఫీజు కట్టనందుకు శుక్రవారం జరిగిన పరీక్షకు తన కూతురిని స్కూల్ యాజమాన్యం అనుతించలేదని, సమయం అడిగినా అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. స్కూల్‍లోకి అనుమతి నిరాకరించటంతో తన కూతురు చాలా బాధపడిందని, ఇంటికి వచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆశోక్ ఫిర్యాదు చేశారు.

గుజరాత్‍లో ఇంజినీరింగ్ విద్యార్థి..

గుజరాత్‍ (Gujarat) లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్ రూమ్‍లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సూరత్‍కు చెందిన దివ్యేశ్ అనే ఎల్‍డీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పరీక్షల ఒత్తిడితో అతడు ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాడని భావిస్తున్నారు. సెమిస్టర్ పరీక్షకు హాజరు కాని అతడు.. హస్టల్‍లో ఉరివేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మొబైల్‍లోని డేటా మొత్తాన్ని అతడు తొలగించాడని పోలీసులు చెప్పారు.

సెమిస్టర్ పరీక్షల కోసం ఇంటికి వెళ్లిన దివ్యేశ్.. మూడు రోజుల క్రితమే క్యాంపస్‍కు వచ్చాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది. సెమిస్టర్ ఎగ్జామ్ హాల్ వరకు వచ్చి అతడు పరీక్ష రాయకుండానే తిరిగి వెళ్లిపోయాడని తెలిపింది. “పరీక్ష రాసిన తర్వాత తన రూమ్‍మేట్స్ వచ్చి చూస్తే గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. దీంతో వారు కిటికీ ద్వారా లోపలికి వెళ్లారు. ఉరి వేసుకున్న తన స్నేహితుడిని కిందికి దించారు” అని పోలీసులు వెల్లడించారు.

కాగా, తెలంగాణలోని నార్సింగిలో సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సిబ్బంది వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాశాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం