Dog Saves Women : మహిళపై వ్యక్తి అత్యాచారయత్నం.. వచ్చి కాపాడిన వీధి కుక్క
Dog Saves Women : ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేస్తుండగా.. ఓ వీధి కుక్క వచ్చి కాపాడింది. ఈ వార్త తాజాగా వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూద్దాం..

కుక్క, మనిషి మధ్య సంబంధాన్ని వివరించాల్సిన అవసరం లేదు. విశ్వాసం చూపించే.. కుక్క మనిషి కోసం ఏమైనా చేస్తాయి. అలాంటి ఘటనలో చాలా చూశాం. యజమాని కోసం పాములతో పొరాడిని కుక్క గురించి ఆ మధ్య వార్తలు వచ్చాయి. కుక్కలు మన కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికి లేదా రిస్క్ చేయడానికి వెనుకాడవు. దీనికి చక్కని ఉదాహరణగా కనిపించే సంఘటన ఇటీవల జరిగింది. ఒక వీధి కుక్క ఒక మహిళను అత్యాచారం నుండి రక్షించింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
నిజాయితీకి మరో పేరు కుక్క. నమ్మదగని కుక్కలు తమ యజమాని కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికి లేదా ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికైనా వెనుకాడవు. అంతేకాకుండా మనుషులను ఆదుకునేందుకు వీధికుక్కలు పరుగెత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురయ్యే మహిళను వీధి కుక్క రక్షించింది.
ఈ ఘటన జూన్ 30న ముంబైలోని వసాయ్‌లో జరిగింది. మాణిక్‌పూర్ సందులో నడుచుకుంటూ వెళ్తున్న 32 ఏళ్ల మహిళపై 35 ఏళ్ల సందీప్ ఖోట్ అత్యాచారానికి ప్రయత్నించాడు. వృత్తిరీత్యా అకౌంటెంట్ అయిన మహిళ అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తుంది. సందీప్ ఆమెను వెంబడించాడు. చంపేస్తాని బెదిరించి, నోరు గట్టిగా పట్టుకుని, నేలపైకి నెట్టి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ సందర్భంలో అక్కడికి వచ్చిన ఓ వీధికుక్క ఆ వ్యక్తిని చూసి బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. దీనితో అతడి భయం వేసింది. వెంటనే పైకి లేచాడు. ఇదే సమయంలో మహిళ వెంటనే అక్కడి నుంచి పారిపోయింది.
ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. 'నేను చీకట్లో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, ఒక వ్యక్తి నన్ను అనుసరించి, నన్ను చంపేస్తానని బెదిరించాడు, ఆపై నా నోరు గట్టిగా పట్టుకుని, నన్ను కిందకు తోసి నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతడిని చూసి వీధి కుక్క వచ్చి గట్టిగా అరుస్తుంది. దీనితో ఆయన భయపడి పైకి లేచాడు. ఆ సందర్భంగా నేను అక్కడి నుంచి పారిపోయాను.' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళ ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టుగా గుర్తించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు.
టాపిక్