Stock Market | ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్ వేళ.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్ వేళ.. దేశీయ సూచీలు మంగళవారం సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి.
Stock market today | దేశీయ సూచీలు.. మంగళవారం సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. ప్రస్తుతం అందరి చూపు ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్‌పైనే ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్.. 307 పాయింట్లు వృద్ధి చెంది.. 53,280 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 98 పాయింట్లు పెరిగి 15,940 వద్ద కొనసాగుతోంది.
సోమవారం సెషన్‌ను 52,974 వద్ద ముగించిన సెన్సెక్స్.. మంగళవారం నాడు 53,352 వద్ద ఓపెన్ అయ్యింది. ఇక సోమవారం 15,842 వద్ద ముగిసిన నిఫ్టీ.. మంగళవారం సెషన్‌ను 15,913 వద్ద ప్రారంభించింది.
లాభాలు.. నష్టాలు..
టాటా స్టీల్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో 1శాతం మేర లాభపడ్డాయి.
సన్‌ఫార్మా, ఇన్ఫీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టెక్ఎం, పవర్‌గ్రిడ్ షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
మాక్రో ఎకనామిక్ డేటా బలహీనంగా ఉన్న కారణంగా అమెరికాలోని టెక్ స్టాక్స్‌లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫలితంగా అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.
జపాన్‌తో పటు పలు ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
సంబంధిత కథనం