Stock market today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 676 అప్-stock market today on 20th july 2022 live updates in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Stock Market Today On 20th July 2022 Live Updates In Telugu

Stock market today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 676 అప్

Praveen Kumar Lenkala HT Telugu
Jul 20, 2022 09:16 AM IST

Stock market today: స్టాక్ మార్కెట్లు ఈనాడు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

మంగళవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు (PTI)

Stock market today: స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ (sensex) 676.85 పాయింట్లు పెరిగి 55,444.47 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 212.35 పాయింట్లు పెరిగి 16,552.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

టాప్ గెయినర్స్ (top gainers) జాబితాలో ఓఎన్జీసీ, రిలయన్స్, ఇండస్ ఇండ్, హిందాల్కో, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టైటన్, శ్రీ సిమెంట్స్, టీసీఎస్ తదితర స్టాక్స్ నిలిచాయి.

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఐచర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా 1 శాతం లోపు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నిఫ్టీ 50లో ఏ ఒక్క స్టాక్ నష్టాల్లో ట్రేడవడం లేదు. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఫిన్ సర్వీస్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ప్రయివేటు బ్యాంక్ నిఫ్టీ ఇన్‌ఫ్రా తదితర సెక్టోరియల్ సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నిఫ్టీ-50 ఒక శాతం కంటే ఎక్కువ లాభాలతో ట్రేడవుతోంది. నిఫ్టీ ఆయిల్ గ్యాస్ ఏకంగా 2.10 శాతం లాభాలతో ట్రేడవుతోంది. నిఫ్టీ ఐటీ 1.30 శాతం లాభపడింది. నిఫ్టీ మెటల్ కూడా 1.23 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టీ ఎనర్జీ 1.82 శాతం లాభంతో ట్రేడవుతోంది.

భారీ లాభాల్లో ఆయిల్ గ్యాస్ స్టాక్స్

నిఫ్టీ ఆయిల్ గ్యాస్ స్టాక్స్‌లో ఆయిల్ ఇండియా 7.10 శాతం లాభపడింది. ఓఎన్జీసీ 6.51 శాతం, గెయిల్ 4.88 శాతం, రిలయన్స్ 2.69 శాతం, గుజరాత్ గ్యాస్ 1.22 శాతం, ఐఓసీ 1.05 శాతం లాభపడ్డాయి.

market pre open news: స్టాక్ మార్కెట్ ప్రి ఓపెనింగ్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్ఈ నిఫ్టీ భారీ లాభాల్లో ఓపెనయ్యాయి.సెన్సెక్స్ 718.50 పాయింట్లు పెరిగి 55,486.12 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 222.25 పాయింట్లు పెరిగి 16,562.80 పాయింట్ల వద్ద స్థిరపడింది.

కాగా నిన్న కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 246.47 పాయింట్లు లాభపడి 54,767.62 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 62.05 పాయింట్లు లాభపడి 16,340.55 పాయింట్ల వద్ద ముగిసింది.

మంగళవారం యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి తన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.05 నుండి కోలుకుని 6 పైసలు పెరిగి 79.92 వద్ద ముగిసింది.

WhatsApp channel

టాపిక్