Stock market today : నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. నిఫ్టీ 100పాయింట్లు డౌన్​-stock market today news on 1st july 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Stock Market Today News On 1st July 2022

Stock market today : నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. నిఫ్టీ 100పాయింట్లు డౌన్​

Sharath Chitturi HT Telugu
Jul 01, 2022 09:22 AM IST

Stock market today : దేశీయ సూచీలు నష్టాల్లో ఓపెన్​ అయ్యాయి. ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఇక అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

స్టాక్​ మార్కెట్​
స్టాక్​ మార్కెట్​ (Utpal Sarkar)

Stock market today : ఇండియా స్టాక్​ మర్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 319పాయింట్ల నష్టంతో 52,7000 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఇక ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 104పాయింట్లు కోల్పోయి 15677 వద్ద కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

జూన్​ నెలలను నష్టంతో ముగించాయి స్టాక్​ మార్కెట్లు. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో 8పాయింటలు కోల్పోయి 53,019 వద్ద ముగిసింది సెన్సెక్స్​. 19పాయింటల నష్టంతో 15,780 వద్ద నిఫ్టీ50 స్థిరపడింది. ఇక జులై నెలను సెన్సెక్స్​, నిఫ్టీ వరుసగా 52,863- 15,704 వద్ద ప్రారంభించాయి.

లాభాలు.. నష్టాలు..

టెక్​ఎం, విప్రో, ఏషియన్​ పెయింట్స్​, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టైటాన్​, డా. రెడ్డీస్​, ఎం అండ్​ ఎం, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికాన్ని నష్టాల్లో ముగించాయి అమెరికా స్టాక్​ మార్కెట్లు. ముఖ్యంగా ఈ త్రైమాసికంలో ఎస్​ అండ్​ పీ 500.. 50ఏళ్లలోనే తొలిసారి దారుణ ప్రదర్శన చేసింది. డౌ జోన్స్​ 0.82శాతం పతనమైంది. నాస్​డాక్​ 1.33శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.8శాతం మేర పడ్డాయి.

(భారత్​లో ఆర్థిక ఏడాది జూన్​ నుంచి మొదలవుతుంది. కాగా అమెరికాలో ఆర్థిక ఏడాది జనవరి నుంచే ప్రారంభమవుతుంది.)

ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. చైనా ఫ్యాక్టరీ ఔట్​పుట్​ పాజిటివ్​గా ఉంటుందన్న అంచనాలు సానుకూలంగా మారాయి. జపాన్​ నిక్కీ 0.37శాతం వృద్ధి చెందింది. సౌత్​ కొరియా కాస్పి 0.67శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 200 0.59శాతం వృద్ధి చెందింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మార్కెట్​లో ఎఫ్​ఐఐల అమ్మకాల జోరు కొనసాగుతోంది. విక్రయాలవైపు ఎఫ్​ఐఐలు మళ్లి.. తొమ్మిది నెలలు గడిచిపోయింది. ఇండియా స్టాక్​ మార్కెట్లో.. ఎఫ్​ఐఐలు అమ్మకాలవైపు ఇంత కాలం ఉండటం ఇదే తొలిసారి. ఎఫ్​ఐఐలు ఒత్తడి నుంచి మార్కెట్లను కాపాడేందుకు డీఐఐలు కొనుగోళ్లు చేస్తున్నా.. వారి బలం సరిపోవడం లేదు. ఆల్​ టైమ్​ హై నుంచి మార్కెట్లు 15శాతం మేర పతనమయ్యాయి.

మరికొంత కాలం ఇదే కొనసాగవచ్చని స్టాక్​ మార్కెట్​ నిపుణులు భావిస్తున్నారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో రూ. 1,138.05కోట్లు విలువ చేసే షేర్లను ఎఫ్​ఐఐలు విక్రయించారు. మరోవైపు డీఐలు రూ. 1,378.20కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్