Stock Market Today : స్టాక్ మార్కెట్ల శుభారంభం.. సెన్సెక్స్ 212 పాయింట్లు అప్
Stock market today june 30th, 2022: స్టాక్ మార్కెట్లు గురువారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
Stock market today june 30th, 2022: స్టాక్ మార్కెట్లు ఈరోజు గురువారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
సెన్సెక్స్ 212 పాయింట్లు పెరిగి 53,239 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 15,855 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
టాప్ గెయినర్స్ జాబితాలో ఇన్ఫోసిస్, టైటన్, హిందాల్కో, రిలయన్స్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బ్రిటానియా, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర స్టాక్స్ నిలిచాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఆటో, సిప్లా, టాటా కన్జ్యూమర్స్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యూపీఎల్, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, కోల్ ఇండియా, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్ తదితర స్టాక్స్ నిలిచాయి.
మార్కెట్ ఉప సూచీల్లో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఫిన్ సర్వ్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎనర్జీ తదితర ఉప సూచీలన్నీ సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
కాగా మార్కెట్ ప్రి ఓపెన్‌లో సెన్సెక్స్ 129.81 పాయింట్లు కోల్పోయి 52,897.16 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 24.60 పాయింట్లు కోల్పోయి 15,774.50 వద్ద స్థిరపడింది.
మార్కెట్లు బుధవారం స్వల్పంగా నష్టాలను చవిచూశాయి. బుధవారం సెన్సెక్స్ 134.31 పాయింట్లు కోల్పోయి 53,026 పాయింట్ల వద్ద క్లోజవగా, నిఫ్టీ 32.95 పాయింట్లు కోల్పోయి 15,799.10 పాయింట్ల వద్ద ముగిసింది.