Stock market today : భారీ నష్టాల్లో సూచీలు.. నిఫ్టీ 165 పాయింట్లు డౌన్​-stock market news today on 10th june 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Stock Market News Today On 10th June 2022

Stock market today : భారీ నష్టాల్లో సూచీలు.. నిఫ్టీ 165 పాయింట్లు డౌన్​

Sharath Chitturi HT Telugu
Jun 10, 2022 09:20 AM IST

Stock market today : దేశీయ సూచీలు.. శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ఉన్నాయి.

స్టాక్​ మార్కెట్​
స్టాక్​ మార్కెట్​ (REUTERS)

Stock market today : అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్​ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 601పాయింట్లు నష్టపోయి 54,719 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 165 పాయింట్ల నష్టంతో 16,314 వద్ద కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

గురువారం ట్రేడింగ్​ సెషన్​ను 428పాయింట్ల లాభంతో 55,320 వద్ద ముగించిన సెన్సెక్స్​.. శుక్రవారం 54,760.25 వద్ద ప్రారంభమైంది. ఇక గురువారం.. 122 పాయింట్ల లాభంతో 16,478 వద్ద స్థిరపడిన నిఫ్టీ.. శుక్రవారం 16,283.95 వద్ద ఓపెన్​ అయ్యింది.

లాభాలు.. నష్టాలు..

ఇన్ఫీ, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎప్​సీ, ఎల్​టీ, టెక్​ఎం షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​ షేర్లు స్వల్ప లాభాల్లో కొనసా

అంతర్జాతీయ మార్కెట్లు..

అమెరికాలో ద్రవ్యోల్బణానికి సంబంధించిన డేటా.. శుక్రవారం విడుదల కానుంది. ద్రవ్యోల్బణం ఇంకా తగ్గలేదని, ఫెడ్​ మరిన్ని చర్యలు చేపట్టక తప్పదన్న ఊహాగానాలతో.. అమెరికా స్టాక్​ మార్కెట్లలో మదుపర్లు భారీ అమ్మకాలు చేశారు. ఈ క్రమంలో యాపిల్​ 3.6శాతం, అమెజాన్​ 4.2శాతం మేర పతనమయ్యాయి. డౌజోన్స్​ 1.94శాతం, ఎస్​ అండ్​ పీ 500 2.38శాతం, నాస్​డాక్​ 2.75శాతం మేర నష్టాల్లో ముగిశాయి.

అమెరికా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి సెగ.. ఆసియా మార్కెట్లను సైతం కలవరపెడుతోంది. జపాన్​ నిక్కీ 1.3శాతం, సౌత్​కొరియా కాస్పి 1.34శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.76శాతం నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

యూరోప్​లో వడ్డీ రేట్ల పెంపు..

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు చర్యలు చేపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి యూరోపియన్​ సెంట్రల్​ బ్యాంక్​ కూడా చేరింది. జులైలో వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఉహించిన దాని కన్నా ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.

ఎఫ్​ఐఐ.. డీఐఐ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లో గురువారం.. ఎఫ్​ఐఐలు రూ. 1,512.24కోట్లు విలువ చేసే షేర్లు విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,624.90 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం