Stock market news : స్వల్ప నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. ​-stock market news today 23 september ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Stock Market News Today 23 September

Stock market news : స్వల్ప నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. ​

Sharath Chitturi HT Telugu
Sep 23, 2022 09:18 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (MINT_PRINT)

Stock market news today in telugu : దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 94పాయింట్ల నష్టంతో 59,026 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 24పాయింట్లు కోల్పోయి 17,606 వద్ద కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్​ 337పాయింట్ల నష్టంతో 59,120 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50.. 89పాయింట్లు కోల్పోయి 17,630 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్​, నిఫ్టీలు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను వరుసగా 59005-17594 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్టు 17,534- 17438 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 17,724- 17,819 వద్ద ఉంది.

లాభాలు.. నష్టాలు..

Stock market news : టాటా స్టీల్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఐటీసీ, ఎం అండ్​ ఎం, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ, టెక్​ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఇండస్​ఇండ్​ బ్యాంకు, కొటాక్​ బ్యాంకు షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం సమస్యల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్​ సూచీ 0.3శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.84శాతం, నాస్​డాక్​ 1.37శాతం నష్టపోయాయి.

అమెరికా మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల పవనాల కారణంగా ఆసియా స్టాక్​ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్​ అవుతున్నాయి. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200.. 1.16శాతం నష్టపోయింది. సౌత్​ కొరియా కాస్పి 0.68శాతం నష్టాల్లో ఉంది.

చమురు ధరలు..

చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్​.. 0.2శాతం పెరిగి బ్యారెల్​కు 90.62డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 2,509.55కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 263.07కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ అండ్​ ఓ బ్యాన్​..

Stocks under F & O ban : అంబుజా సిమెంట్స్​, కాన్​ ఫిన్​ హోమ్స్​, డెల్టా కార్ప్​, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, ఆర్​బీఎల్​ బ్యాంక్​ షేర్లు నేడు ఎఫ్​ అండ్​ ఓ బ్యాన్​ లిస్ట్​లోకి చేరాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం