Stock market live : స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్స్​.. లాభాల్లో సూచీలు-stock market live news 5th august 2022 in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Stock Market Live News 5th August 2022 In Telugu

స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్స్​(REUTERS)

Stock market live : స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్స్​.. లాభాల్లో సూచీలు

07:46 AM ISTSharath Chitturi
  • Share on Facebook
07:46 AM IST

  • Stock market live : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొని చివరికి ఫ్లాట్​గా ముగిశాయి. శుక్రవారం సెషన్​ లైవ్​ అప్డేట్స్​ ఇక్కడ చూడండి..

Fri, 05 Aug 202207:46 AM IST

స్టాక్​ మార్కెట్లు ఇలా..

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 153 పాయింట్ల లాభంతో 58,451 వద్ద ఉంది. నిఫ్టీ.. 40 పాయింట్లు వృద్ధిచెంది 17,416 వద్ద ట్రేడ్​ అవుతోంది.
 

అల్ట్రాటెక్​, ఐసీఐసీ బ్యాంక్​, ఎయిర్​టెల్​, ఇన్ఫీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

మారుతీ, రిలయన్స్​, ఎం అండ్​ ఎం షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

Fri, 05 Aug 202205:52 AM IST

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​

ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అనేది అర్థం చేసుకోవడం చాలా సులభమైన విషయం. స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుని, ఎనాలసిస్​కు టైమ్​ లేని వారు ఇందులో ఇన్​వెస్ట్​ చేసుకోవచ్చు. మరి ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్​ అంటే ఏంటి?


పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Fri, 05 Aug 202205:15 AM IST

లాభాల్లో సూచీలు..

ఆర్​బీఐ వడ్డీ రేట్ల పెంపు అంచనాలకు తగ్గట్టుగానే ఉండటంతో.. దేశీయ స్టాక్​ మార్కెట్లు మరింత లాభాల్లోకి వెళ్లాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 194పాయింట్ల లాభంతో 58,493 వద్ద ఉంది. నిఫ్టీ.. 50 పాయింట్ల లాభంతో 17,432 వద్ద కొనసాగుతోంది.

Fri, 05 Aug 202205:14 AM IST

రైట్​ హైక్​

వడ్డీ రేట్లను మరోమారు పెంచింది ఆర్​బీఐ. 50బేసిస్​ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేట్లు 5.4శాతానికి చేరుకున్నాయి. కొవిడ్​ సంక్షోభానికి ముందు వడ్డీ రేట్లు ఇంతే ఉండేవి.

Fri, 05 Aug 202204:18 AM IST

నిఫ్టీ సూచీలు…

నిఫ్టీ బ్యాంక్​ 0.3శాతం, నిఫ్టీ ఎఫ్​ఎంసీజీ 0.4శాతం, నిఫ్టీ ఐటీ 0.34శాతం, నిఫ్టీ మెటల్​ 0.28శాతం లాభాల్లో ఉండగా.. నిఫ్టీ ఆటో మాత్రం 0.16శాతం నష్టాల్లో ఉంది. ఇక నిఫ్టీ 50.. 0.2శాతం లాభాల్లో ఉంది.

Fri, 05 Aug 202204:18 AM IST

త్రైమాసిక ఫలితాలు..

ఎం అండ్​ ఎం, టైటాన్​, ఇంజినీర్స్​ ఇండియా, ఎన్​ఎండీసీ, నైకా, పెట్రోనెట్​ ఎల్​ఎన్​జీ, ఆదిత్య బిర్లా ఫ్యాషన్​ అండ్​ రిటైల్​, ఆల్కెమ్​ లెబోరేటరీస్​, ఫైజర్​ వంటి సంస్థల త్రైమాసిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి.

ఎస్​బీఐ, బీపీసీఎల్​, హిందుస్థాన్​ పెట్రోలియం, కార్పొరేషన్​, మారికో, అమర రాజ బ్యాటరీస్​, బిర్లా కార్పొరేషన్​, స్కిప్పర్​ వంటి సంస్థ త్రైమాసిక ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.

Fri, 05 Aug 202203:48 AM IST

లాభాలు.. నష్టాలు..

టాటాస్టీల్​, అల్ట్రాటెక్​, ఎల్​ అండ్​ టీ, ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇన్ఫీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

Fri, 05 Aug 202203:48 AM IST

ఓపెనింగ్​ ఇలా..

దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 187 పాయింట్లు వృద్ధిచెంది.. 58,586 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 52 పాయింట్ల లాభంతో 17,434 వద్ద ట్రేడ్​ అవుతోంది.

Fri, 05 Aug 202203:42 AM IST

లాభాల్లో మార్కెట్లు

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 58,414- 17,424 వద్ద లాభాల్లో ప్రారంభించాయి.

Fri, 05 Aug 202203:16 AM IST

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1474.77కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 46.79కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

Fri, 05 Aug 202203:13 AM IST

అంతర్జాతీయ మార్కెట్లు..

అమెరికా మార్కెట్లు గురువారం సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. శుక్రవారం యూఎస్​ జాబ్​ డేటా వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. డౌ జోన్స2 0.2శాతం, నాస్​డాక్​ 0.4శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.7శాతం పతనమయ్యాయి.

తైవాన్​ పరిసర ప్రాంతాల్లో చైనా మిలిటరీ డ్రిల్స్​ చేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు ఫ్లాట్​గా ఉన్నాయి. జపాన్​ నిక్కీ ఫ్లాట్​గా ఓపెన్​ అయ్యింది. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 నష్టాల్లో ఉంది. సౌత్​ కొరియా కాస్పి 0.5శాతం వృద్ధిచెందింది.

Fri, 05 Aug 202203:01 AM IST

స్టాక్స్​ టు ట్రేడ్​

Fri, 05 Aug 202202:41 AM IST

నిఫ్టీ అప్​ట్రెండ్​

గురువారం తీవ్ర ఒడిదొడుకుల సెషన్​ నమోదైనప్పటికీ.. నిఫ్టీ ఇంకా అప్​ట్రెండ్​లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్​లో రివర్సల్​ వచ్చే సూచనలు టెక్నికల్​గా కనిపించడం లేదన్నారు. అయితే.. మరో 2-3 సెషన్ల వరకు ఒడిదొడుకులు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీకి.. 17,200 మార్క్​ వద్ద సపోర్ట్​ ఉందని, 17,500 వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉందని చెబుతున్నారు.

Fri, 05 Aug 202202:34 AM IST

గురువారం సెషన్​

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో నిఫ్టీ.. 6 పాయింట్ల నష్టంతో 17,382 వద్ద స్థిరపడింది. 51పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​.. 58,298 వద్ద ముగిసింది.

Fri, 05 Aug 202202:33 AM IST

పాజిటివ్​ ఓపెనింగ్​!

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషను లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. 53పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం