SBI PO Prelims Result 2023: ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..-state bank of india declares results of probationary officers examination ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  State Bank Of India Declares Results Of Probationary Officers Examination

SBI PO Prelims Result 2023: ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Nov 22, 2023 11:19 AM IST

SBI PO Prelims Result 2023: ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) బుధవారం వెల్లడించింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో చూసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

SBI PO Prelims Result 2023: ఈ సంవత్సరం నవంబర్ మొదట్లో నిర్వహించిన ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) బుధవారం ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ sbi.co.in లో అప్ లోడ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

డిసెంబర్ 5న మెయిన్ పరీక్ష

ఎస్బీఐ (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం ఈ సంవత్సరం నవంబర్‌లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించింది. ఈ ప్రిలిమ్స్ ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ మెయిన్ పరీక్ష ఈ డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కాల్ లెటర్స్ ను త్వరలో వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తారు. మెయిన్ పరీక్ష ఫలితాలను డిసెంబర్ చివర్లో కానీ, వచ్చే సంవత్సరం జనవరి మొదట్లో కాని విడుదల చేసే అవకాశం ఉంది.

సైకోమెట్రిక్ టెస్ట్..

మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులపై సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఆ తరువాత, జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఫైనల్ రిజల్ట్స్ ను 2024 ఫిబ్రవరి, లేదా మార్చి నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ వివరాలు..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్బీఐ లో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 7న ప్రారంభమై సెప్టెంబర్ 27న ముగిసింది. కాగా, బ్యాంక్ వెబ్‌సైట్‌లో భారీ ట్రాఫిక్ కారణంగా, రిజల్ట్ లింక్ సరిగ్గా పని చేయడం లేదు. అభ్యర్థులు కొంత సమయం వేచి ఉండి, యాక్సెస్ లేని పక్షంలో మళ్లీ ప్రయత్నించాలి.

ప్రిలిమ్స్ ఫలితాలు.

ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలను ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా తెలుసుకోవచ్చు.

  • బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in కి వెళ్లండి.
  • careers ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • current openings పై క్లిక్ చేసి, ఆపై Probationary Officers పేజీకి క్లిక్ చేయండి.
  • result లింక్‌ పై క్లిక్ చేయండి.
  • లాగిన్ చేసి, రిజల్ట్ ను చెక్ చేసుకోండి.
  • రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • రిజల్ట్ ను సేవ్ చేసుకోండి. ఒక ప్రింటౌట్ తీసుకోండి.

WhatsApp channel