అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని ఒక స్టార్‌బక్స్ ఔట్లెట్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారింది! ఓ డెలివరీ డ్రైవర్ మీద వేడి టీ పడటంతో అతను కేసు వేశాడు. అతనికి సానుకూలంగా తీర్పు వెలువడింది. ఫలితంగా, సదరు వ్యక్తికి స్టార్‌బక్స్ ఇప్పుడు 50 మిలియన్ డాలర్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది! అసలేం జరిగిందంటే..
2020 ఫిబ్రవరి 8న మైఖెల్ గర్షియా అనే డెలివరీ డ్రైవర్.. ఆర్డర్ పిక్ చేసుకునేందుకు లాస్ ఏంజెల్స్‌లోని స్టార్‌బక్స్ ఔట్‌లెట్‌కి వెళ్లాడు. ఆర్డర్లో 3 డ్రింక్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక దానికి లిడ్ సరిగ్గా పెట్టి లేదు.
మైఖేల్ ఆర్డర్ తీసుకుని తన తొడల దగ్గర పెట్టున్న వెంటనే మూత ఊడి వచ్చేసింది. ఆ వేడి వేడి టీ అతని మీద పడింది. ఫలితంగా మైఖెల్‌కి థర్డ్ డిగ్రీ గాయాలు అయ్యాయి. ఆ తర్వాత అతని మర్మాంగాల దగ్గర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. చర్మాన్ని కూడా మార్చాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో స్టార్‌బక్స్‌పై మైఖేల్ కేసు వేశాడు. సిబ్బంది నిర్లక్షంతో తనకు చాలా నష్టం, కష్టం జరిగిందని వివరించాడు. ఈ ఘటన వల్ల తాను భౌతికంగా, మానసికంగా బాధపడినట్టు, జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోయినట్టు, తనకు అసౌకర్యం కలిగినట్టు మైఖెల్ చెప్పుకొచ్చాడు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన లాస్ ఏంజెల్స్ కౌంటీ జ్యూరీ.. మైఖేల్‌కి సానుకూలంగా తీర్పును ఇచ్చింది. సదరు డెలివరీ డ్రైవర్‌కి 50 మిలియన్ డాలర్లు చెల్లించాలని స్టార్బక్స్కి ఆదేశించింది.
50 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 434 కోట్లు.
"కస్టమర్ సేఫ్టీని పట్టించుకోకపోవడం, బాధ్యతాయుతంగా ఉండకపోవడాన్ని ఈ తీర్పు గుర్తుచేస్తుంది," అని మైఖెల్ అటార్నీ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు.
ఈ పూర్తి వ్యవహారంపై స్టార్‌బక్స్ స్పందించింది. జ్యూరీ నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని పేర్కొంది.
"మైఖెల్ జరిగింది సరైనది కాదు. కానీ మా తప్పు ఉంది, అందుకే ఇంత మొత్తంలో పరిహారం చెల్లించాలన్న జ్యూరీ నిర్ణయాన్ని మేము అంగీకరించలేము. మా స్టోర్స్‌లో ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేందుకు నిత్యం కృషిచేస్తాము," అని కంపెనీ ప్రతినిథి వెల్లడించారు.
మరి ఈ పూర్తి వ్యవహారంపై ఈ స్పందన ఏంటి?
సంబంధిత కథనం