Starbucks new CEO : స్టార్​బక్స్​ కొత్త సీఈఓగా భారత సంతతి లక్ష్మణ్​-starbucks new ceo is an indian origin laxman narasimhan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Starbucks New Ceo : స్టార్​బక్స్​ కొత్త సీఈఓగా భారత సంతతి లక్ష్మణ్​

Starbucks new CEO : స్టార్​బక్స్​ కొత్త సీఈఓగా భారత సంతతి లక్ష్మణ్​

Sharath Chitturi HT Telugu

Starbucks new CEO : స్టార్​బక్స్​కు కొత్త సీఈఓగా ఎంపికయ్యారు లక్ష్మణ్​ నరసింహన్​. ఆయన వచ్చే ఏడాది.. బాధ్యతలు చేపట్టనున్నారు.

స్టార్​బక్స్​ కొత్త సీఈఓగా భారత సంతతి లక్ష్మణ్​ (Mint)

Starbucks new CEO : ప్రముఖ కాఫీ షాప్స్​లో ఒకటైన స్టార్​బక్స్​ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్​ నరసింహన్​ నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్టార్​బక్స్​ ప్రకటించింది. లక్ష్మణ్​ నరసింహన్​.. ఈ ఏడాది అక్టోబర్​లో స్టార్​బక్స్​తో చేరనున్నారు.

ప్రస్తుతం స్టార్​బక్స్​ సీఈఓగా ఉన్న హోవర్డ్​ షుల్ట్​జ్​ స్థానంలోకి లక్ష్మణ్​ నరసింహన్​ వెళ్లనున్నారు. కాగా.. 2023 ఏప్రిల్​ వరకు స్టార్​బక్స్​ తాత్కాలిక సీఈఓగా వ్యవహరించనున్నారు హోవర్డ్​.

55ఏళ్ల లక్ష్మణ్​ నరసింహన్​.. బ్రిటన్​కు చెందిన లైసోల్​ అండ్​ ఎన్​ఫామిల్​ బేబీ ఫార్ముల కంపెనీకి సీఈఓగా వ్యవహరించారు. కొత్త సీఈఓపై స్టార్​బక్స్​ యాజమాన్యం పూర్తి విశ్వాసంతో ఉంది. వ్యాపార రంగంలో ఆయన మంచి నేతగా భావిస్తోంది. స్టార్​బక్స్​ సీఈఓగా బాధ్యతలు చేపట్టడం కోసం.. లండన్​ నుంచి అమెరికాలోని సీటెల్​ ప్రాంతానికి వలస వెళ్లనున్నారు లక్ష్మణ్​ నరసింహన్​.

Starbucks appoints new CEO : "2023 ఏప్రిల్​ వరకు తాత్కాలిక సీఈఓగా ఉండి.. లక్ష్మణ్​కు సహాయం చేయాలని హోవర్డ్​ను కోరాము. స్టార్​బక్స్​ కొత్త సీఈఓగా వచ్చే ఏడాది ఏప్రిల్​ 1న లక్ష్మణ్​ నరసింహన్ బాధ్యతలు స్వీకరిస్తారు," అని స్టార్​బక్స్​ ప్రకటించింది.

<p>లక్ష్మణ్​ నరసింహన్​</p>
లక్ష్మణ్​ నరసింహన్​ (ANI)

సంస్థ వృద్ధి కోసం స్టార్​బక్స్​కు ఉద్యోగులు, ప్రతిభావంతుడైన సీఈఓ అవసరం విపరీతంగా ఉంది. ఈ దశాబ్దం చివరి నాటికి.. ప్రపంచవ్యాప్తంగా 20,000కుపైగా స్టార్​బక్స్​ స్టోర్స్​ను ఓపెన్​ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆ సంస్థ.

భారతీయులను ఆకర్షించేందుకు..!

Starbucks India : భారత దేశంలో కూడా అనేక స్టార్​బక్స్​ ఔట్​లెట్​లు ఉన్నాయి. కాఫీ లవర్స్​కు నచ్చే కేఫేల్లో స్టార్​బక్స్​ ఒకటి.

భారతీయ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ చైన్ అయిన స్టార్‌బక్స్ తన మెనూలో ‘మసాలా చాయ్’ అలాగే ‘ఫిల్టర్ కాఫీ’ని అప్ డేట్ చేయనుంది.

సీజన్‌ను బట్టి, డిమాండ్‌ను బట్టి రెస్టారెంట్ మెనూల్లో మార్పులు చేర్పులు చేయడం మార్కెటింగ్ ట్రిక్. మన ఇండియన్స్‌కి క్యాపచ్చినో, లాట్టే ఫ్లేవర్ల కంటే కూడా మసాలా చాయ్, ఇరానీ చాయ్, సాధారణ ఫిల్టర్ కాఫీలే ఇష్టం. ఈ ఇష్టాన్ని చాలా ఆలస్యంగా గ్రహించిన స్టార్‌బక్స్ ఎట్టకేలకు వీటిని తమ మెనూలో చేరుస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసేలా #ItStartsWithYourName అనే హ్యాష్‌టాగ్‌తో ప్రచారం కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా కాఫీ కప్పులపై వినియోగదారుల పేర్లను రాసి వారు కోరిన కాఫీ లేదా టీ ఫ్లేవర్లను అందించనున్నారు.

కొత్త మెనూలో చాక్లెట్ టీ, వెనీలా టీ, స్ట్రాబెర్రీ టీలతో పాటు క్లాసిక్ మసాలా చాయ్, ఇలైచీ చాయ్, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఉంటాయి. మసాలా చాయ్, ఫిల్టర్ కాఫీ ధరలు రూ. 190 నుంచి ప్రారంభమవుతుండగా, మిల్క్‌షేక్‌ల ధరలు రూ. 275 నుంచి ప్రారంభమవుతున్నాయి.

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.