Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం-stage set for counting of votes for presidential poll ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Stage Set For Counting Of Votes For Presidential Poll

Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 01:39 PM IST

Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది.

కౌంటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లను బయటకు తీస్తున్న అధికారులు
కౌంటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లను బయటకు తీస్తున్న అధికారులు (AP)

న్యూఢిల్లీ, జూలై 21: దేశ 15వ రాష్ట్రపతి పేరును ప్రకటించేందుకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభమైందని, పోలింగ్ అధికారులు వివిధ రాష్ట్రాలకు చెందిన బ్యాలెట్ పేపర్లను సార్టింగ్ చేశారని అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఎన్‌డీఏ తరఫున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు.

కౌంటింగ్ ప్రారంభమయ్యే ముందు వివిధ రాష్ట్రాల ఎంపీల ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పేపర్లు సార్టింగ్ చేశారు.

కేరళ, మేఘాలయ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను అక్షర క్రమం ప్రకారం క్రమబద్ధీకరించారు.

ఎమ్మెల్యేలు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లపై తమ ఓట్లను నమోదు చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న పార్లమెంట్ హౌస్, వివిధ శాసనసభలలో ఓటింగ్ జరిగింది.

ఎన్నికల ప్రధాన రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుల పర్యవేక్షణలో పార్లమెంట్ భవనంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

IPL_Entry_Point