Results of 3 states elections: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ-stage set for counting in tripura meghalaya nagaland bjp confident about outcome ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Stage Set For Counting In Tripura, Meghalaya, Nagaland; Bjp Confident About Outcome

Results of 3 states elections: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 10:15 PM IST

Results of 3 states elections: మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు రంగం సిద్ధమైంది. మార్చి 2న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాు వెలువడనున్నాయి.

మేఘాలయలో ఎన్నికల నాటి దృశ్యం
మేఘాలయలో ఎన్నికల నాటి దృశ్యం (Rupjyoti Sarmah)

త్రిపుర (Tripura) అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న, మేఘాలయ (Meghalaya), నాగాలాండ్ (Nagaland) అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న ముగిశాయి. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 2, గురువారం వెలువడనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Election results: గెలుపు పై ధీమా

ఈ మూడు ఈశాన్య రాష్ట్రాల (NE states) ఎన్నికలను ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయం తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని దెబ్బగొట్టిన బీజేపీ.. ఈ ఎన్నికల్లోనూ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని భావిస్తోంది. నాగాలాండ్ లో ఎన్డీపీపీ - బీజేపీ (NDPP-BJP) కూటమి, త్రిపురలో బీజేపీ, మేఘాలయలో హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం గమనార్హం. త్రిపురలో 87.76%, మేఘాలయలో 85.27%, నాగాలాండ్ లో 85.90% పోలింగ్ నమోదైంది.

Bypoll results: ఉప ఎన్నికల ఫలితాలు కూడా..

మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, తమిళనాడు లోని ఈరోడ్ స్థానానికి, పశ్చిమబెంగాల్ లోని సాగర్ధిఘి స్థానానికి, జార్ఖండ్ లోని రామ్ గఢ్ స్థానానికి, మహారాష్ట్రలోని కస్బాపథ్, చించ్వాడ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా మార్చి 2న వెల్లడి కానున్నాయి. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అటు షిండేకు, ఇటు ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత కీలకంగా మారింది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీలు అధికార కూటమిగా ఉన్నాయి. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం వేరువేరుగా పోటీ చేశాయి.

WhatsApp channel