Stag Beetle : ఈ కీటకం ఖరీదు చాలా ఎక్కువ.. ఎందుకంత డిమాండ్ తెలుసా?
Stag Beetle : సాధారణంగా పురుగులను చాలా తక్కువ చేసి చూస్తాం. కానీ వాటికి కూడా చాలా డిమాండ్ ఉంది. ఒక పురుగు ధర రూ.75 లక్షలు. మీరు విన్నది నిజమే. ఓ పురుగు ధర చాలా ఎక్కువ ఉంది.
ప్రకృతి తనలో ఎన్నో ఆశ్చర్యాలను దాచుకుంటుంది. సంపద అంతా ప్రకృతి నుంచి వచ్చేదే. ప్రకృతికి ప్రతిదీ సహజమైనప్పటికీ, మనిషికి ప్రతిదీ ప్రత్యేకమైనది. అనేక విషయాలు వింతగా ఉంటాయి. నిజానికి పురుగు అంటే అందరూ తక్కువ చేసి చూస్తారు. పురుగు అనే కీటకంతో ఎవరినైనా తక్కువ చేసి పోల్చుతాం. కానీ ఓ పురుగు ధర గురించి తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు. దాని ధర రూ.75 లక్షలు. ఆ కీటక పేరు స్టాగ్ బీటిల్.
స్టాగ్ బీటిల్ అనే కీటకం ధర చూస్తే కళ్లు తిరుగుతాయి. ఈ కీటకం మీ దగ్గర ఉంటే లక్షల రూపాయలు పొందవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం స్టాగ్ బీటిల్, ఒక్కో కీటకం ధర రూ.75 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో స్టాగ్ బీటిల్ ఒకటిగా ఉంది.
స్టాగ్ బీటిల్ ఎందుకు చాలా ఖరీదైనది అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఎందుకంటే ఇది చాలా అరుదైన కీటకం, ఇది అదృష్టానికి సంకేతమని నమ్ముతారు. కొందరి దగ్గర ఉంటే.. రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారని గట్టిగా నమ్ముతారు. స్టాగ్ బీటిల్ అనేది అటవీ పర్యావరణ వ్యవస్థలలో ముఖ్యమైన సాప్రోక్సిలిక్ కూర్పును సూచించే ఒక క్రిమి. సైంటిఫిక్ డేటా జర్నల్ ప్రకారం, ఆ పురుగులు పెద్ద దవడలు, ధైర్యానికి ప్రసిద్ధి చెందినవి.
లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం, ఈ కీటకాలు 2-6 గ్రాముల బరువు, సగటున 3-7 సంవత్సరాలు జీవిస్తాయి. మగ పురుగుల పొడవు 35-75 మి.మీ, ఆడ పురుగులు.. 30-50 మి.మీ పొడవు ఉంటాయి. ఈ కీటకాలను ఔషధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. ఈ బీటిల్ దవడలు జింక కొమ్ములను పోలి ఉంటాయి. అందుకే దీనికి స్టాగ్ బీటిల్ అని పేరు. మగ స్టాగ్ బీటిల్స్ సంతానోత్పత్తి కాలంలో ఆడవాటితో జతకట్టే అవకాశం కోసం ఒకదానికొకటి పోరాడటానికి కొమ్ము లాంటి వాటిని ఉపయోగిస్తాయి. విచిత్రమైన శబ్దాలు చేస్తాయి.
స్టాగ్ బీటిల్స్ వెచ్చని, ఉష్ణమండల వాతావరణంలో వృద్ధి చెందుతాయి. చల్లని ఉష్ణోగ్రతలకు సున్నితంగా ఉంటాయి. సహజంగా అడవులు, హీత్‌ల్యాండ్, సాంప్రదాయ ఉద్యానవనాలు వంటి పట్టణ ప్రాంతాలలో కూడా నివసిస్తాయి. ఈ స్టాగ్ బీటిల్స్ అనేక కీటకాలను అనేక చికిత్సల్లోనూ వాడుతారు. అదృష్టానికి గుర్తుగా కూడా.. భావిస్తారు. అందుకే దీనికి అంత ధర ఉంటుంది.