SSC Notification: 2 వేలకు పైగా పోస్ట్ లతో ఎస్ఎస్సీ నోటిఫికేషన్
2024 ఎస్ఎస్సీ సెలెక్షన్ పోస్ట్స్ ఫేజ్ 12 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 2049 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చూడండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024 ఫిబ్రవరి 26న ఎస్ఎస్సీ సెలెక్షన్ పోస్టుల ఫేజ్ 12 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక కొత్త వెబ్ సైట్ ssc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
లాస్ట్ డేట్ మార్చి 18..
ఈ ఎస్సెస్సీ ఫేజ్ 12 పోస్ట్ లకు అప్లై చేయడానికి మార్చి 18, 2024 లాస్ట్ డేట్. అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసిన తరువాత ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి మార్చి 19 వరకు గడువు ఉంటుంది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 2049 పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తరువాత, అప్లికేషన్ లో ఏవైనా మార్పులు చేయడానికిి వీలు కల్పించే కరెక్షన్ విండో మార్చి 22న ప్రారంభమై, మార్చి 24న ముగుస్తుంది. 2024 మే 6 నుంచి 8 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఎంపిక విధానం
మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్ ఆపై స్థాయిల్లో కనీస విద్యార్హత కలిగిన పోస్టులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో కూడిన మూడు వేర్వేరు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో సూచించిన టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వంటి స్కిల్ టెస్టులు నిర్వహిస్తారు.
పరీక్ష ఫీజు
అభ్యర్థులు రూ.100 లను పరీక్ష ఫీజుగా చెల్లించాలి. భీమ్ యుపిఐ, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి మాత్రమే ఆన్ లైన్ లో ఫీజు చెల్లించవచ్చు. రిజర్వేషన్ కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.