SSC MTS Exam 2022: ఎస్సెస్సీ ఎంటీఎస్ పోస్ట్ లపై కీలక అప్ డేట్-ssc mts exam 2022 final vacancies list out at ssc nic in 11788 posts to be filled ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ssc Mts Exam 2022: Final Vacancies List Out At Ssc.nic.in, 11788 Posts To Be Filled

SSC MTS Exam 2022: ఎస్సెస్సీ ఎంటీఎస్ పోస్ట్ లపై కీలక అప్ డేట్

HT Telugu Desk HT Telugu
Oct 12, 2023 11:57 AM IST

SSC MTS Exam 2022: ఎస్ఎస్సీ ఎంటీఎస్ 2022 (SSC MTS) పోస్టుల సంఖ్య పై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఆ పరీక్ష ద్వారా మొత్తం 11788 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (ssc.nic.in)

SSC MTS Exam 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ (Havaldar) పోస్టుల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. 2 దశల్లో పరీక్షలు కూడా నిర్వహించింది. అయితే మొదట ఈ రిక్రూట్మెంట్ ద్వారా 12,523 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్ఎస్సి ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ పోస్టుల సంఖ్యను సవరిస్తూ మరో ప్రకటన జారి చేసింది. ప్రస్తుత ప్రకటన ప్రకారం మొత్తం 11788 ఎంటీఎస్, హవల్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో 8519 ఎంటీఎస్ పోస్టులను 18 నుంచి 25 ఏళ్ల ఏజ్ గ్రూపు వారికి, 2740 పోస్ట్ లను 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న వారికి, 529 వేకెన్సీలను సీబీఐసీలో హవల్దార్ పోస్ట్ లకు కేటాయించారు.

ట్రెండింగ్ వార్తలు

త్వరలో ఫలితాలు..

ఎస్ఎస్సీ ఎంటీఎస్ (SSC MTS) పరీక్షను ఈ సంవత్సరం మే నెలలో రెండు దశల్లో నిర్వహించారు. మే 2వ తేదీ నుంచి మే 19 వ తేదీ వరకు మొదటి దశ పరీక్షను, జూన్ 13వ తేదీ నుంచి జూన్ 20 వ తేదీ వరకు రెండో దశ పరీక్షను నిర్వహించారు.. ఫైనల్ ఆన్సర్ కీ ని జూన్ 28 వ తేదీన విడుదల చేశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి పీఈటీ / పీఎస్ టీ (PET/PST) పరీక్షను సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 28 మధ్య నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.

వెబ్ సైట్ లో..

కాగా ఎస్ఎస్సీ ఎంటీఎస్, హవల్దార్ ((SSC MTS)) పోస్టులకు సంబంధించిన వేకెన్సీల వివరాలు తెలుసుకోవడానికి ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ ssc.nic.in. ను సందర్శించాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

  • ముందుగా ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ ssc.nic.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీ పై కనిపించే SSC MTS Exam 2022 vacancies list లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్త పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
  • అందులో కేటగిరీల వారీగా వేకెన్సీ ల వివరాలు ఉంటాయి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ఆ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకోవాలి.
  • పూర్తి వివరాల కోసం ఎస్ఎస్సి వెబ్సైటు ssc.nic.in. ను చూడాలి.

WhatsApp channel