SSC MTS results: ఎస్సెస్సీ ఎంటీఎస్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..-ssc mts and havaldar cbic and cbn examination 2023 result out at sscnicin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Mts Results: ఎస్సెస్సీ ఎంటీఎస్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

SSC MTS results: ఎస్సెస్సీ ఎంటీఎస్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Nov 07, 2023 08:20 PM IST

SSC MTS results: ఎస్సెస్సీ ఎంటీఎస్ (SSC MTS), హవల్దార్ (CBIC & CBN) పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ssc.nic.in వెబ్ సైట్ లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (ssc.nic.in)

SSC MTS results: మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పరీక్ష, 2023 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబర్ 7న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్సెస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.

సెప్టెంబర్ 1 నుంచి..

ఈ పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహించింది. ఇది కంప్యూటర్ బెస్డ్ పరీక్ష. “PET/PST లో అర్హత సాధించడంలో విఫలమైన అభ్యర్థులు తుది ఫలితంలో హవల్దార్ పదవికి పరిగణించబడరు. అయితే, అటువంటి అభ్యర్థులను MTS పోస్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేస్తే, వారు MTS పోస్ట్‌కు అర్హులుగా ఉంటారు. హవల్దార్ పోస్టుకు PET/PST పూర్తి అయిన తర్వాత.. రెండు పోస్టులకు అంటే MTS, హవల్దార్‌ పోస్ట్ లకు కలిపి ఒకేసారి తుది ఫలితాలను ప్రకటిస్తాము’’ అని ఎస్సెస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

మొత్తం 4380 మంది

ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్, హవల్దార్ పోస్ట్ లకు సంబంధించిన పరీక్షలో.. మొత్తం 4380 మంది అభ్యర్థులు హవల్దార్ పోస్ట్ నకు సంబంధించి PET/PST కి హాజరు కావడానికి అర్హత సాధించారు. ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించిన తరువాతనే ఫైనల్ ఆన్సర్ కీని, అర్హత సాధించిన అభ్యర్థుల మార్కుల లిస్ట్ ను, అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల లిస్ట్ ను ssc.nic.in వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు.

Whats_app_banner