SSC Head Constable Result 2022: హెడ్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల విడుదల
SSC Head Constable Result 2022: హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ - 2022 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పరీక్షకు హాజరైన అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు.
ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అక్టోబరు 10 నుంచి అక్టోబరు 20, 2022 మధ్య నిర్వహించారు. కనీస అర్హత మార్కులు (ఎన్‌సీసీ బోనస్ మార్కులు కాకుండా) 40 శాతంగా నిర్దేశించారు. ఇవి అన్ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులకు వర్తిస్తాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 35 శాతం మార్కులు ఉండాలి. అలాగే దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులైతే కనీస అర్హత మార్కులుగా 30 శాతం మార్కులు సాధించాలి. ఫలితాల కోసం అభ్యర్థులు ఈ కింది జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవచ్చు.
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను పీఈ అండ్ ఎంటీ పరీక్షలకు పిలుస్తారు. పీఈ అండ్ ఎంటీ పరీక్షల షెడ్యూులును ఢిల్లీ పోలీసు విభాగం నిర్ణయిస్తుంది. దీని కోసం ఢిల్లీ పోలీసు విభాగం వెబ్ సైట్ సందర్శించాల్సి ఉంటుంది.
అర్హులైన, అనర్హులైన అభ్యర్థుల మార్కులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. జనవరి 10 నుంచి జనవరి 24 వరకు ఈ మార్కుల జాబితా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.