SSC GD Recruitment 2024 : భద్రతా దళాల్లో 26,146 పోస్టులు.. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ!-ssc gd recruitment 2024 registration for 26146 posts begins ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Ssc Gd Recruitment 2024: Registration For 26146 Posts Begins

SSC GD Recruitment 2024 : భద్రతా దళాల్లో 26,146 పోస్టులు.. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ!

Sharath Chitturi HT Telugu
Nov 25, 2023 11:19 AM IST

SSC GD Recruitment 2024 : దేశంలోని వివిధ భద్రతా దళాల్లోని 26,146 పోస్టులను భర్తీ చేసేందుకు రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది ఎస్​ఎస్​సీ. ఆ వివరాలు..

సీఏపీఎఫ్​లో 26,146 పోస్టులు.. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలు!
సీఏపీఎఫ్​లో 26,146 పోస్టులు.. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలు! (ssc.nic.in)

SSC GD Recruitment 2024 : ఎస్​ఎస్​సీ జీడీ రిక్రూట్​మెంట్​ 2024కు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. సీఏపీఎఫ్​, ఎస్​ఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ (జీడీ), రైఫిల్​మాన్​ (జీడీ), అసోం రైఫిల్స్​లో 26,146 పోస్టులను ఈ దఫా రిక్రూట్​మెంట్​లో భర్తీ చేయనుంది స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​. అధికారిక వెబ్​సైట్​ ssc.nic.in లో అప్లై చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ 2023 డిసెంబర్​ 31న ముగియనుంది. ఆన్​లైన్​ ఫీజ్​ పేమెంట్​కు చివరి గడువు 2024 జనవరి 1. ఈ రిక్రూట్​మెంట్​ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

ముఖ్యమైన తేదీలు..

రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలు:- 2023 నవంబర్​ 24.

రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ముగిసే తేదీ:- 2023 డిసెంబర్​ 31

SSC GD Recruitment 2024 apply online : పేమెంట్​కు చివరి తేదీ:- 2024 జనవరి 1.

అప్లికేషన్​లను కరెక్ట్​ చేసుకునేందుకు 2024 జనవరి 4 నుంచి జనవరి 6 వరకు సమయం ఉంటుంది.

వేకెన్సీ- అర్హత వివరాలు..

బీఎస్​ఎఫ్​:- 6,174 పోస్టులు

సీఐఎస్​ఎఫ్​:- 11,025 పోస్టులు

సీఆర్​పీఎఫ్​:- 3,337 పోస్టులు

ఎస్​ఎస్​బీ:- 633 పోస్టులు

ఐటీబీపీ:- 3,189 పోస్టులు

ఎస్​ఎస్​ఎఫ్​:- 296 పోస్టులు

SSC GD Recruitment 2024 notification : ఈ దఫా రిక్రూట్​మెంట్​కు అప్లై చేద్దామని భావిస్తున్న వారు.. దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన ఎడ్జ్యుకేషన్​ బోర్డు నుంచి 10వ తరగతి పాస్​ అయ్యి ఉండాలి. వయస్సు పరిమిత 18- 23ఏళ్లు. అంటే.. 2024 జనవరి 1 నాటికి 23ఏళ్లు వచ్చి ఉండాలి.

సెలక్షన్​ ప్రక్రియ- ఫీజు..

రిక్రూట్​మెంట్​లో భాగంగా సీబీఈ (కంప్యూటర్​ బేస్డ్​ ఎగ్జామినేషన్​), పీఎస్​టీ (ఫిజికల్​ స్టాండర్డ్​ టెస్ట్​), పీఈటీ (ఫిజికల్​ ఎఫీషియెన్సీ టెస్ట్​), మెడికల్​ ఎగ్జామినేషన్​, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ వంటివి ఉంటాయి. సీబీఈ.. ఇంగ్లీష్​, ఇందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం జరుగుతుంది.

ఫీజు:- మహిళలు, ఎస్​సీ, ఎస్​టీ, ఎక్స్​-సర్వీస్​మెన్​కు ఉచితం. ఇతరులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం