స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్‌కు సంబంధించి పేపర్- 1 పరీక్ష రాయబోతున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డు జారీ అయ్యింది. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), ఎస్ఎస్ఎఫ్, అస్సోం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్(జీడీ), నార్కొటిక్స్ కంట్రలో బ్యూరోలో సిపాయి తదితర పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలుకు అడ్మిట్ కార్డు జారీఅయ్యింది. అడ్మిట్ కార్డులు ఆయా అధికారిక సైట్లకు సంబంధించి ప్రాంతీయ వెబ్‌సైట్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.,పేపర్ -1 కు సంబంధించి రాత పరీక్ష జనవరి 10 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు కింది లింక్‌ల ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.,Direct link to download SSC WR admit card,Direct link to download SSC NWR admit card,Direct link to download SSC MPR admit card,SSC GD Admit Card 2022: డౌన్ లోడ్ ఇలాస్టాఫ్ సెలెక్షన్ కమిషనర్ ప్రాంతీయ వెబ్‌సైట్ సందర్శించాలి. SSC GD Admit Card 2022 for Paper I link అని ఉన్న చోట క్లిక్ చేయాలిఅప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ వివరాలు నమోదు చేయాలి.లాగిన్ అవగానే మీ అడ్మిట్ కార్డు స్క్రీన్ పై డిస్‌ప్లే అవుతుంది.ఇప్పుడు అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ కూడా తీసి పెట్టుకోండి.అభ్యర్థులు ఒక ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు మీ వెంట తెచ్చుకోవాలి. అడ్మిషన్ సర్టిఫికెట్‌లో ఉన్న జన్మదిన తేదీ వివరాలతో సరిపోలాలి. మరిన్ని వివరాలకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్ చూడండి.