SSC CHSL result out: సీహెచ్ఎస్ఎల్ 2023 ఫలితాలను ప్రకటించిన ఎస్ఎస్సీ-ssc chsl 2023 tier 1 result out 19 556 candidates qualify link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Chsl Result Out: సీహెచ్ఎస్ఎల్ 2023 ఫలితాలను ప్రకటించిన ఎస్ఎస్సీ

SSC CHSL result out: సీహెచ్ఎస్ఎల్ 2023 ఫలితాలను ప్రకటించిన ఎస్ఎస్సీ

HT Telugu Desk HT Telugu
Sep 28, 2023 04:13 PM IST

SSC CHSL result out: కంబైన్డ్ హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ 2023 (CHSL 2023) టయర్ 1 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 19,556 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

SSC CHSL result out: కంబైన్డ్ హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ 2023 (CHSL 2023) టయర్ 1 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 19,556 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించింది. ఈ టయర్ 1 పరీక్షలో ఉత్తీర్ణులైన 19,556 మంది, టయర్ 2 పరీక్ష రాయాల్సి ఉంటుంది.

రిజల్ట్స్ ఇక్కడ..

ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2023 (SSC CHSL 2023) టయర్ 1 ఫలితాలను ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in లో చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ కీని, అభ్యర్థుల మార్కులను త్వరలో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయనున్నారు. ఈ పరీక్షను ఎస్ఎస్సీ దేశవ్యాప్తంగా పలు పరీక్షాకేంద్రాల్లో ఆగస్ట్ 2 వ తేదీ నుంచి ఆగస్ట్ 17వ తేదీ వరకు నిర్వహించింది. ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఈ పరీక్షకు సంబంధించి కేటగిరీ వారీగా కటాఫ్ ను కూడా ఎస్ఎస్సీ ప్రకటించింది. అవి

  • అన్ రిజర్వ్డ్ : 30%
  • ఓబీసీ, ఈడబ్ల్యూఎస్: 25%
  • అన్ని ఇతర కేటగిరీలు : 20

టయర్ 1 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు

టయర్ 1 పరీక్షలో వివిధ వేకెన్సీలకు గానూ ఉత్తీర్ణులైన అభ్యర్థుల సంఖ్య ఇలా ఉంది.

  • ఎల్డీసీ, జేఎస్ఏ: 17,495
  • డీఈఓ(CAG & DCA): 754
  • డీఈఓ (CAG & DCA కేటగిరీలోకి రానివారు): 1,307
  • 10 మంది అభ్యర్థుల ఫలితాలను విత్ హెల్డ్ లో పెట్టారు.
  • ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2023 (SSC CHSL 2023) టయర్ 2 పరీక్ష నవంబర్ 2 న జరిగే అవకాశముంది.