SSC CHSL Results: ఎస్‍ఎస్‌సీ సీహెచ్‍ఎస్ఎల్ రిజల్ట్స్ వచ్చేశాయి: చెక్ చేసుకోండిలా!-ssc chsl 2021 results out at ssc nic in check full list direct link ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ssc Chsl 2021 Results Out At Ssc.nic.in Check Full List Direct Link

SSC CHSL Results: ఎస్‍ఎస్‌సీ సీహెచ్‍ఎస్ఎల్ రిజల్ట్స్ వచ్చేశాయి: చెక్ చేసుకోండిలా!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 19, 2023 05:19 PM IST

SSC CHSL 2021 Results: ఎస్‍ఎస్‍సీ సీహెచ్‍ఎల్ 2021కు సంబంధించిన స్కిల్ టెస్ట్ ఫలితాలు వెల్లడయ్యాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్‍కు అర్హత సాధించిన వారి జాబితాను ఎస్‍ఎస్‍సీ విడుదల చేసింది.

SSC CHSL Results: ఎస్‍ఎస్‌సీ సీహెచ్‍ఎస్ఎల్ రిజల్ట్స్ వచ్చేశాయి
SSC CHSL Results: ఎస్‍ఎస్‌సీ సీహెచ్‍ఎస్ఎల్ రిజల్ట్స్ వచ్చేశాయి

SSC CHSL 2021 Results: కంబైన్డ్ హైయర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (Combined Higher Secondary Level Examination), 2021 స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) వెల్లడించింది. పరీక్షల్లో పాల్గొని డాక్యుమెంట్ వెరిఫికేషన్‍కు అర్హత సాధించిన అభ్యర్థుల పూర్తి జాబితాను రిలీజ్ చేసింది. 2021లో వెల్లడైన ఈ సీహెచ్ఎస్ఎల్ (SSC CHSL 2021) నోటిఫికేషన్‍కు సంబంధించి రాత, నైపుణ్య పరీక్షలు గతేడాది జరిగాయి. గత సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించిన టైపింగ్ టెస్టు (Typing Test), డీఈఎస్‍టీ (DEST) పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి లిస్టును ఎస్‍ఎస్‍సీ ఇప్పుడు వెల్లడించింది. ఎస్ఎస్‍సీ అధికారిక వెబ్‍సైట్ ssc.nic.inలో ఈ ఫలితాలను ఉంచింది. వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

మొత్తంగా 16,160 మంది

SSC CHSL 2021 Results: టైపింగ్ టెస్టులో 14,873 మంది అర్హత సాధించారు. వీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‍కు హాజరుకావాల్సి ఉంటుంది. మొత్తంగా టైపింగ్ టెస్టుకు 35,023 మంది హాజరుకాగా, 14,873 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్ట్ అయ్యారని ఎస్ఎస్‍సీ వెల్లడించింది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల పేర్లతో పూర్తి జాబితాను విడుదల చేసింది. ఇక DEST టెస్టులో 220 మంది, DEST (సీఏజీ మినహా) టెస్టులో 1067 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్‍కు అర్హత సాధించారని ఎస్ఎస్‍సీ పేర్కొంది. మొత్తంగా 16,160 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్‍కు క్వాలిఫై అయ్యారు. ఈ జాబితాలన్నీ ssc.nic.in వెబ్‍సైట్‍లో అందుబాటులో ఉన్నాయి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలను ఎస్‍ఎస్‍సీ త్వరలోనే వెల్లడించనుంది.

SSC CHSL 2021 Results: ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • ముందుగా ssc.nic.in వెబ్‍సైట్‍లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో రిజల్ట్స్ ఆప్షన్‍పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓపెన్ అయిన పేజీలో CHSL అనే ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.
  • అక్కడే SSC CHSL 2021కు సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్‍కు అర్హత సాధించిన పేర్లు ఉన్న పీడీఎఫ్‍ను డౌన్‍లోడ్ చేసుకోవాలి. దాంట్లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోవాలి.

టైపింగ్ టెస్టులో అర్హత సాధించిన వారి జాబితా డైరెక్ట్ లింక్ ఇదే

మరోవైపు, ఈ ఏడాది ఎస్ఎస్‍సీ సీజీఎల్ (SSC CGL) నోటిఫికేషన్ ఏప్రిల్ 1వ తేదీన వెల్లడవుతుందని సమాచారం బయటికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఎస్‍ఎస్‍సీ నోటిఫికేషన్ తీసుకురానుంది. ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ నోటిఫికేషన్‍లోనూ వేలాది పోస్టులు ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం