SSC CGL 2022: ఎస్ఎస్సీ సీజీఎల్ 2022 (SSC CGL 2022) కి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఎస్ఎస్సీ సీజీఎల్ 2022 (SSC CGL 2022) ఫైనల్ వేకెన్సీ లిస్ట్ ను, ఆప్షన్ కమ్ ప్రిఫరెన్స్ ఫామ్ ను విడుదల చేశారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in. లో ఆ వివరాలు చెక్ చేసుకోవచ్చు.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) తమ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in. లో ఎస్ఎస్సీ సీజీఎల్ 2022 (Staff Selection Commission Combined Graduate Level Examination 2022 - SSC CGL 2022) కి సంబంధించిన ఫైనల్ వేకెన్సీ లిస్ట్ ను, ఆప్షన్ కమ్ ప్రిఫరెన్స్ ఫామ్ ను అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే, ఈ పరీక్ష ద్వారా ఫిల్ చేసే వేకెన్సీల వివరాలను వెల్లడించింది. అభ్యర్థుల కోసం ప్రిఫరెన్స్ ఫామ్ లను కూడా ssc.nic.in. లో సిద్ధంగా ఉంచింది. ఇవి ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
అభ్యర్థులు ssc.nic.in. వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, ఆప్షన్ కమ్ ప్రిఫరెన్స్ ఫామ్ లను తమ ఆసక్తులకు అనుగుణంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందుకు తుది గడువు మే 1వ తేదీ. క్యాండిడేట్ లాగిన్ () ద్వారా అభ్యర్థులు ssc.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. మే 1 తరువాత ఎస్ఎస్సీ సీజీఎల్ 2022 (SSC CGL 2022) ఫైనల్ ఫలితాలు వెలువడుతాయి. ఎస్ఎస్సీ సీజీఎల్ 2022 (SSC CGL 2022) టయర్ 1 (tier 1) పరీక్ష2022 డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు జరిగింది. అలాగే, టయర్ 2 (tier 2) పరీక్ష 2023 మార్చి 2వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు జరిగింది.
ఎస్ఎస్సీ సీజీఎల్ 2022 (SSC CGL 2022) నోటిఫికేషన్ ప్రకారం వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 36,012 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఇవి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. ఇవి కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ (ESM) కు 2940 పోస్ట్ లు, ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ (OH) కు 451 పోస్ట్ లు, హీయరింగ్ హ్యాండీక్యాప్డ్ (HH) కు 424 పోస్ట్ లు, విజువల్లీ హ్యాండీక్యాప్డ్ (VH) కు 277 పోస్ట్ లు, ఇతర దివ్యాంగులకు 263 పోస్ట్ లు ఉన్నాయి.