Spurious liquor: గుజరాత్‌లో నకిలీ మద్యం తాగి 22 మంది దుర్మరణం-spurious liquor claims twenty two lives in dry gujarat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Spurious Liquor Claims Twenty-two Lives In Dry Gujarat

Spurious liquor: గుజరాత్‌లో నకిలీ మద్యం తాగి 22 మంది దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Jul 26, 2022 12:16 PM IST

Spurious liquor: గుజరాత్‌లో నకిలీ మద్యం తాగి 22 మంది మృతిచెందారు.

నకిలీ మద్యంతాగి అస్వస్థకు గురైన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం
నకిలీ మద్యంతాగి అస్వస్థకు గురైన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం (AP)

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్, బొటాడ్ జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో నకిలీ మద్యం సేవించి కనీసం ఇరవై రెండు మంది మరణించారు. యాభై మందికి పైగా రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

బోటాడ్‌లో మొత్తం మృతుల సంఖ్య 16 కాగా, 54 మంది వైద్య చికిత్స పొందుతున్నారని బోటాడ్ కంట్రోల్ రూం ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్‌ఎం చౌహాన్ తెలిపారు.

నీటిలో విష రసాయనాలను కలిపి మద్యం పేరుతో విక్రయించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని బొటాడ్ పోలీసు సూపరింటెండెంట్ కరణ్‌రాజ్ వాఘేలా తెలిపారు. మరణాలకు కారణమైన అనుమానిత రసాయనాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం గుర్తించిందని ఆయన చెప్పారు.

గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆదివారం రాత్రి ఓ అక్రమ మద్యం వ్యాపారి నుండి కొనుగోలు చేసిన నకిలీ మద్యం తాగిన తర్వాత అస్వస్థతకు గురయ్యారని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై విచారణ జరిపి నకిలీ మద్యం విక్రయించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)ని కూడా ప్రభుత్వం ఈ విషయంపై విచారణకు నియమించింది.

అహ్మదాబాద్ జిల్లాలోని ధంధూకా తాలూకాలో కల్తీ మద్యం సేవించి సోమవారం ఇలాంటి ఘటనలో ఆరుగురు మరణించారని ధంధూకా పోలీస్ స్టేషన్‌లోని పోలీస్ ఇన్‌స్పెక్టర్ కేపీ జడేజా తెలిపారు. విష రసాయనం సేవించి అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఆరుగురి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ధంధూకాకు చెందిన కొందరు గ్రామస్తులు కల్తీ మద్యం విక్రయిస్తున్న బొటాడ్ గ్రామాలకు వెళ్లి విష రసాయనం సేవించి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

WhatsApp channel