Parliament special session : ముందస్తు ఎన్నికలా? లేదా ఆ బిల్లుల కోసమా?- ప్రత్యేక సెషన్​పై ఉత్కంఠ!-speculations rife after governments call for parliament special session ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Speculations Rife After Government's Call For Parliament Special Session

Parliament special session : ముందస్తు ఎన్నికలా? లేదా ఆ బిల్లుల కోసమా?- ప్రత్యేక సెషన్​పై ఉత్కంఠ!

Sharath Chitturi HT Telugu
Sep 01, 2023 06:43 AM IST

Parliament special session : ముందస్తు ఎన్నికలు రానున్నాయా? ఎన్నికల కోసం మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోందా? పార్లమెంట్​ స్పెషల్​ సెషన్​ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పార్లమెంట్​ స్పెషల్​ సెషన్​ ఎందుకు?
పార్లమెంట్​ స్పెషల్​ సెషన్​ ఎందుకు? (Pralhad Joshi Twitter)

Parliament special session : పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18 నుంచి 22 వరకు స్పెషల్​ సెషన్​ను నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అజెండా గురించి అసలు తెలియకపోవడం, ప్రభుత్వం మాట్లాడకపోవడంతో ఈ ఉత్కంఠ నెక్ట్స్​ లెవల్​కు చేరింది. ఈ వ్యవహారంపై పలు ఆసక్తికర ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందస్తుకు సిద్ధమవుతోందని కొందరు భావిస్తుంటే.. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకే ఈ భేటీ అని ఇంకొందరు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ముందస్తు ఎన్నికల కోసమేనా?

2024లో లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పార్టీలన్నీ ఇప్పటికే సన్నద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమంట్​ ప్రత్యేక సమావేశాల్లో.. తమ పాలనలో సాధించిన ఘనతలను ప్రజలకు తెలియజేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా చేస్తే రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లాభపడొచ్చని బీజేపీ భావిస్తోందని పలువురు చెబుతున్నారు.

అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.. పార్లమెంట్​ సమావేశాలను నిర్వహించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కేంద్ర కేబినెట్​ ఆమోద ముద్ర వేస్తే సరిపోతుందని గుర్తుచేస్తున్నారు. ఈ మాటలు.. మరింత ఉత్కంఠకు దారితీశాయి.

Parliament special session Agenda : మోదీ ప్రభుత్వంపై పోరాటానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. "ఇండియా" కూటమిగా ఏర్పడి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళుతున్నాయి. అయితే.. ఎన్నికల కోసం ఈ కూటమి ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం అవ్వలేదన్న మాట వాస్తవం! ఎన్నికల బరిలోకి దిగేందుకు కూటమికి ఇంకాస్త సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే మాత్రం.. ఇండియా కూటమికి కష్టాలు తప్పవని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కీలక బిల్లుల ఆమోదం కోసమేనా..?

ఇక కీలక బిల్లులను ప్రవేశపెట్టి, వాటిని ఆమోదించుకునేందుకే.. పార్లమెంట్​ స్పెషల్​ సెషన్​కు ప్రభుత్వం పిలుపునిచ్చిందని ఇంకొందరు అంటున్నారు. 'ఒకే దేశం- ఒకే ఎన్నికలు', 'ఉమ్మడి పౌర స్మృతి' వంటి బిల్లుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

One nation on Election : ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి. వీటి వల్ల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకే.. దేశం మొత్తానికి లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకే నిర్వహించాలన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిపై బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో సానుకూలంగా స్పందించింది. అయితే ఇందుకోసం చట్టాలను సవరించాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉంటుంది.

మరోవైపు అమృత్​ కాల్​ అంటూ.. స్పెషల్​ సెషన్​ను పాత పార్లమెంట్​లో మొదలుపెట్టి.. దేశ ప్రగతి, ఘనతలు, భవిష్యత్తును వివరించి.. సమావేశాలను కొత్త భవనంలో ముగించేందుకే ఈ భేటీ అని ఇంకొందరు అంటున్నారు.

Parliament special session 2023 : అయితే ఇవన్నీ ఊహగానాలు మాత్రమే. ప్రభుత్వం వీటిపై స్పందించేంత వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. మోదీ ప్రభుత్వం ఈసారి ఎలాంటి మాస్టర్​ ప్లాన్​ వేసిందో చూడాలి!

సంబంధిత కథనం

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.