CBI Summons Kejriwal: సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
CBI Summons Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆదివారం సీబీఐ (CBI) విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ కానుంది.
CBI Summons Kejriwal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీబీఐ (CBI) విచారణకు హాజరు కానున్నారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్ష నేతలను భయపెట్టడానికి ఆయుధాలుగా వాడుతున్నారని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపణలు గుప్పించారు.
ట్రెండింగ్ వార్తలు
CBI Summons Kejriwal: అసెంబ్లీ ప్రత్యేక భేటీ..
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ (CBI) విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ (CBI) ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా చర్చ జరిపే అవకాశముంది. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. సీబీఐ (CBI), ఈడీ (ED) లను తప్పుడు కేసులతో విపక్ష నేతలపై ఉసిగొల్పుతున్నారు. ఈ తీరును ఎదిరించాల్సిన అవసరం ఉంది’ అని ఆప్ (AAP) ఎమ్మెల్యే సౌరభ్ భరధ్వాజ్ కేంద్రంపై మండిపడ్డారు.
CBI Summons Kejriwal: కోర్టులో కేసు వేస్తా..
లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని సీబీఐ తనకు సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) మండిపడ్డారు. కోర్ట్ కు తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నాయని ఆరోపిస్తూ సీబీఐ (CBI), ఈడీ (ED) లపై సుప్రీం కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించినవని చెబుతూ సీబీఐ (CBI), ఈడీ (ED) లు సమర్పించిన 14 స్మార్ట్ ఫోన్ల వివరాలు అబద్ధాలని కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు.