Sovereign gold bond scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభం..
Sovereign gold bond scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022-23 - సిరీస్ II నేడు సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయ్యింది. ఆగస్టు 22 నుండి ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
sovereign gold bond scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (SGB) 2022-23 తదుపరి విడత ఇష్యూ నేడు ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుది. ధర గ్రాము బంగారంపై రూ. 5,197గా నిర్ణయించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది.
‘ఈ సువర్ణావకాశాన్ని కోల్పోకండి! సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ 2022-23 సిరీస్ - II ఆగస్టు 22 నుండి 26 ఆగస్టు వరకు తెరిచి ఉంటుంది..’ అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
గోల్డ్ బాండ్ స్కీమ్ గురించి 10 ముఖ్యాంశాలు ఇవే..
1) కేంద్రం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది.
2) బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ద్వారా గోల్డ్ బాండ్లను విక్రయిస్తారు.
3) గోల్డ్ బాండ్లు 1 గ్రాము బంగారం విలువతో, విభిన్న డినామినేషన్లలో కొనుగోలు చేయవచ్చు.
4) బాండ్ అవధి 8 సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిలో 5వ సంవత్సరం తర్వాత నిష్క్రమణను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
5) గోల్డ్ బాండ్ స్కీమ్‌లో కనీసం 1 గ్రాము బంగారం మేర కొనుగోలు చేయాల్సి ఉంటంది.
6) సబ్‌స్క్రిప్షన్ గరిష్ట పరిమితి వ్యక్తులకు 4 కిలోలుగా నిర్ధారించారు. హిందూ అవిభాజ్య కుటుంబమైతే 4 కేజీలు, ట్రస్టులు; సారూప్య సంస్థలైతే ఆర్థిక సంవత్సరానికి 20 కేజీల చొప్పున కొనుగోలు చేయవచ్చు.
7) ఫిజికల్ గోల్డ్ కొనుగోలు కోసం వర్తించే నో-యువర్-కస్టమర్ (KYC) నిబంధనలు ఇక్కడ కూడా వర్తిస్తాయి.
8) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు గ్రాముకు రూ. 50 తగ్గింపును అందించాలని కేంద్రం నిర్ణయించింది.
9) ఫిజికల్ గోల్డ్ డిమాండ్‌ను తగ్గించడం, బంగారం కొనుగోలు కోసం ఉపయోగించే దేశీయ పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపుగా మార్చడం అనే లక్ష్యంతో ఈ పథకం నవంబర్ 2015లో ప్రారంభమైంది.
10) సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి 3 పనిదినాల్లో ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా బాండ్ ధర భారతీయ కరెన్సీలో నిర్ణయిస్తారు.