Southwest monsoon : గుడ్ న్యూస్- కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..
Southwest monsoon in Kerala : నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ మేరకు ఐఎండీ ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Southwest monsoon in Kerala : భారీ ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకినట్టు స్పష్టం చేసింది. కేరళవ్యాప్తంగా రుతపవనాల కదలికలకు అనువైన పరిస్థితి ఉందని వెల్లడించింది.
కేరళతో పాటు ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాల్లోకి కూడా 2024 నైరుతి రుతుపవనాలు చేరాయని ఐఎండీ వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి..!
భారత దేశానికి ఈ నైరుతి రుతుపవనాలు చాలా కీలకం. సాధారణంగా.. జూన్ 1కి అటు, ఇటుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. గతేడాది జూన్ 8న, ఆలస్యంగా రుతుపవనాలు కేరళను తాకాయి. కానీ ఈసారి.. మే 31నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని కొన్ని రోజుల క్రితం ఐఎండీ అంచనా వేసింది.
Southwest monsoon 2024 : కానీ.. సాధారణం కన్నా రెండు రోజులు, ఐఎండీ అంచనాల కన్నా ఒక రోజు ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడం విశేషం. సాధారణంగా.. ఈశాన్య భారతంలో జూన్ 5కు అటు, ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే 30నే ప్రవేశించాయి. కొన్ని రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన రేమల్ తుపాను.. రుతుపవనాలను వేగంగా తీసుకొచ్చినట్టు వాతావరణ నిపుణులు చెప్పారు.
భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు ఇది నిజంగా ఉపశమనాన్ని కలిగించే వార్తే!
Southwest monsoon in Telangana : మరోవైపు.. రుతుపవనాల ప్రభావంతో కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో కనీవినీ ఎరుగని రీతులో వర్షాలు పడ్డాయట. ఇక రానున్న రోజుల్లో వర్షాల ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది.
పైగా.. ఈసారి అతి తక్కువ రోజుల్లోనే రుతుపవనాలు కేరళను చుట్టేసే అవకాశం ఉంది. ఇంకో 24 గంటల్లో రుతుపవనాలు కేరళను దాటేయొచ్చు! అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఇక ఈసారి జులై 15 కన్నా ముందే.. రుతుపవనాలు దేశం మొత్తని కవర్ చేసే అవకాశం ఉంది.
దిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగేది ఎప్పుడు..?
Delhi heatwave 2024 : దేశ రాజధాని దిల్లీలో గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం.. గరిష్ఠంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై, ప్రజలను బెంబెలెత్తించింది. వీటి మధ్య రుతుపవనాలపైనే ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
మే 30న కేరళ- ఈశాన్య భారతంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. దిల్లీని తాకేందుకు జూన్ 27 వరకు సమయం పడుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది.
మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిస్థితేంటి?
Southwest monsoon in Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో మే నెల చివరిలో ఎండలు మళ్లీ పెరిగాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో కేరళను రుతుపవనాలు తాకాయి అన్న వార్త ఉపశమనాన్ని ఇస్తుంది.
కాగా.. మే 31 లేదా వచ్చే జూన్ ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఇటీవలే తెలిపారు. ఆ తర్వాత తెలంగాణకు కూడా చేరుతాయి.
సంబంధిత కథనం