AI Anchors : తెలుగు, కన్నడ మీడియాలో ఏఐ యాంకర్లు ఎంట్రీ-చక్కగా వార్తలు చదివేస్తున్న మాయ, సౌందర్య-south india telugu kannada media introduced ai anchor maya soundarya ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ai Anchors : తెలుగు, కన్నడ మీడియాలో ఏఐ యాంకర్లు ఎంట్రీ-చక్కగా వార్తలు చదివేస్తున్న మాయ, సౌందర్య

AI Anchors : తెలుగు, కన్నడ మీడియాలో ఏఐ యాంకర్లు ఎంట్రీ-చక్కగా వార్తలు చదివేస్తున్న మాయ, సౌందర్య

Bandaru Satyaprasad HT Telugu
Jul 12, 2023 04:51 PM IST

AI Anchors : తెలుగు మీడియా రంగంలోనూ ఏఐ యాంకర్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ టీవీ తెలుగులో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ మాయతో వార్తలు చదివించింది. కన్నడలోనూ సౌందర్య అనే ఏఐ యాంకర్ వార్తలు మొదలుపెట్టింది.

ఏఐ యాంకర్లు
ఏఐ యాంకర్లు

AI Anchors : రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుకుంది. టెలివిజన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల ఒడిశాకు చెందిన ఓ మీడియా ఛానల్ ఏఐ యాంకర్ తో వార్తలు చదివించి...మీడియా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు తెలుగులోనూ ఏఐ యాంకర్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ మీడియా ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ మాయను సృష్టించారు. ఈ మాయ అచ్చం నిజమైన యాంకర్ లాగానే వార్తలు చదువుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయంగా పలు మీడియా ఛానల్స్ ఏఐ యాంకర్స్ తో వార్తలు చదవిస్తున్నాయి.

yearly horoscope entry point

తెలుగు మీడియాలో

తెలుగులో బిగ్ టీవీ రూపొందించిన ఏఐ యాంకర్‌కు మాయ అని పేరుపెట్టారు. ఏఐ యాంకర్ మాయ తెలుగులో వార్తలు చాలా స్పష్టంగా చదువుతోంది. వార్తలు చదువుతోంది మీ మాయ... బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే టెక్నాలజీ నన్ను పుట్టిందంటూ... స్పష్టమైన భాషతో వార్తలు చదువేస్తోంది ఈ వర్చువల్ న్యూస్ యాంకర్‌. మామూలు న్యూస్ యాంకర్లకు పోటీగా... చాలా అద్భుతంగా వార్తలు చదివి వినిపిస్తోంది. ఈ ఏఐ యాంకర్ మాయను తెలుగులో స్పష్టంగా వార్తలు చదివేలా ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేసినట్లు బిగ్ టీవీ నిర్వాహకులు తెలిపారు. ఏఐ సాంకేతికపై మీడియా రంగంలో చర్చకు దారితీస్తుంది. ఏఐ యాంకర్ ప్రయోగం విజయవంతం అయితే టీవీ రంగంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు. ఇప్పటికే నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మరింత నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టెలివిజన్ రంగంలో పని చేస్తు్న్న యాంకర్ల పై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

కన్నడలోనూ

టీవీ యాంకర్ల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమిస్తోంది. ఇటీవల ఒడిశా టీవీ ఛానెల్ OTV లీసా అనే ఏఐ న్యూస్ యాంకర్ వార్తలు చదివి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండియా టుడేతో సహా పలు వార్తా ఛానెల్‌లు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్‌లను పరిచయం చేశాయి. ఈ సందర్భంగా కర్నాటకలో సౌందర్య అనే ఏఐ యాంకర్ తో పవర్ టీవీ వార్తలను ప్రసారం చేసేందుకు ప్రయత్నించింది. దీని ద్వారా కన్నడిగులకు తొలి ఏఐ న్యూస్ యాంకర్ పరిచయం చేసింది. "హలో కన్నడిగులు, పవర్ టీవీకి స్వాగతం. నేను సౌందర్య, సౌత్ ఇండియాలో మొట్టమొదటి AI న్యూస్ యాంకర్. అంటే రోబో యాంకర్..." అని వార్తలు చదవడం ప్రారంభించిన తర్వాత, సౌందర్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ...మీడియా రంగానికి సంబంధించిన సమాచారాన్ని చదివింది. ఈ AI యాంకర్ తరచుగా కనురెప్పలు ఆడిస్తూ, కొన్ని ముఖ కవళికలతో వార్తలను చదవడం చూడవచ్చు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.