Sonia Gandhi: సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత; గంగారాం ఆసుపత్రిలో చికిత్స
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె బాధపడుతున్నారని, ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
Sonia Gandhi: కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ ఉదర సంబంధిత సమస్యతో గురువారం ఉదయం సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రానికి సోనియాగాంధీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఉదర సంబంధమైన సమస్యతో..
‘‘ఉదర సంబంధమైన సమస్యతో ఆమె ఈ రోజు అడ్మిట్ అయ్యారు. అయితే, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. రేపు ఉదయానికల్లా ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది’’ అని సర్ గంగారామ్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ గ్యాస్ట్రోఎంటరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సమీరన్ నుండీ సంరక్షణలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గత ఏడాది డిసెంబర్ లో 78వ వసంతంలోకి అడుగుపెట్టారు.
రాజ్యసభలో..
ఫిబ్రవరి 13న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోనియాగాంధీ చివరిసారిగా రాజ్యసభలో కనిపించారు. ఆహార భద్రత చట్టం కింద దేశంలో సుమారు 14 కోట్ల మంది ప్రజలు ప్రయోజనాలకు దూరమవుతున్నారని పేర్కొంటూ జనగణనను త్వరితగతిన పూర్తి చేయాలని ఫిబ్రవరి 10న సోనియాగాంధీ ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) కింద లబ్ధిదారులను 2011 జనాభా లెక్కల ప్రకారం గుర్తిస్తున్నామని, తాజా జనాభా లెక్కల ప్రకారం కాదని రాజ్యసభలో తన తొలి జీరో అవర్ ప్రసంగంలో సోనియాగాంధీ అన్నారు. 2013 సెప్టెంబర్ లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఎఫ్ ఎస్ ఏ దేశంలోని 140 కోట్ల జనాభాకు ఆహారం, పౌష్టికాహార భద్రత కల్పించే లక్ష్యంతో చేపట్టిన మైలురాయిగా సోనియాగాంధీ అభివర్ణించారు. ముఖ్యంగా కోవిడ్ -19 సంక్షోభ సమయంలో లక్షలాది నిరుపేద కుటుంబాలను ఆకలి నుండి రక్షించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషించిందని సోనియా గాంధీ అన్నారు.
సంబంధిత కథనం