US Visa interview waiver: ‘‘ఈ కేటగిరీలకు యూఎస్ వీసా ఇంటర్వ్యూ ఉండదు’’-skip the queue us embassy in india expands visa interview waiver process for these travellers looking for renewal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Visa Interview Waiver: ‘‘ఈ కేటగిరీలకు యూఎస్ వీసా ఇంటర్వ్యూ ఉండదు’’

US Visa interview waiver: ‘‘ఈ కేటగిరీలకు యూఎస్ వీసా ఇంటర్వ్యూ ఉండదు’’

HT Telugu Desk HT Telugu
May 05, 2023 03:15 PM IST

US Visa interview waiver: అమెరికా వీసా రెన్యువల్ కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. కొన్ని కేటగిరీల వీసా రెన్యువల్ అభ్యర్థనలకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ను తొలగించాలని యూఎస్ ఎంబసీ నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

US Visa interview waiver: అమెరికా వీసా (US visa) రెన్యువల్ కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. కొన్ని కేటగిరీల వీసా రెన్యువల్ అభ్యర్థనలకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ను తొలగించాలని యూఎస్ ఎంబసీ నిర్ణయించింది.

US Visa interview waiver: ఏ కేటగిరీలకు ఇంటర్వ్యూ ఉండదు?

వీసా రెన్యువల్ (Visa Renewal) కోసం దరఖాస్తు చేసుకునే వారిలో కొన్ని కేటగిరీలకు ఇంటర్వ్యూ ఉండదని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. ముఖ్యంగా, గత వీసాలకు సంబంధించి ‘‘క్లియరెన్స్ రిసీవ్డ్ (clearance received)’’, ‘‘ డిపార్ట్మెంట్ ఆథరైజేషన్ (department authorization)’’ ఉన్నవారు వీసా రెన్యువల్ చేసుకోవాలనుకుంటే.. వారు వీసా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అమెరికా వీసా అప్లికేషన్ ప్రాసెస్ ను మరింత సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఎంబసీకి రద్దీ తగ్గడంతో పాటు వీసా దరఖాస్తుదారులు మళ్లీ ఇంటర్వ్యూకి వెళ్లే టెన్షన్ తప్పుతుంది. అలాగే, అటు ఎంబసీ అధికారులకు, ఇటు దరఖాస్తుదారులకు చాలా సమయం ఆదా అవుతుంది.

US Visa interview waiver: షరతులు వర్తిస్తాయి..

అయితే, ఈ వీసా ఇంటర్వ్యూ కి మినహాయింపు కొన్ని షరతులకు లోబడి ఉంటుందని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. ముఖ్యంగా మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు, గతంలో ఉన్న వీసా కేటగిరీకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, F, H-1, H-3, H-4, నాన్ బ్లాంకెట్ ఎల్ (non-blanket L), M, O, P, Q, ఎకడమిక్ జే (academic J) వీసాల విషయంలో ఇంటర్వ్యూ మినహాయింపు ఇచ్చే విచక్షణాధికారం కాన్సులర్ ఆఫీసర్స్ (consular officers) కు ఉంటుంది. అంటే, పైన పేర్కొన్న కేటగిరీల వీసా దరఖాస్తుదారులకు గతంలో వేరే కేటగిరీ వీసా ఉండి ఉంటే, వారికి ఇప్పుడు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయాన్ని కాన్సులర్ ఆఫీసర్స్ ((consular officers)) తీసుకుంటారు. అయితే, వారు గతంలో ఏ దేశం నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకుని ఉంటారో, ఇప్పుడు కూడా అదే దేశం నుంచి అప్లై చేసుకుని ఉండాలి. అలాగే, గతంలో ఏదైనా కారణంతో వీసా దరఖాస్తు రిజెక్ట్ అయితే, వారికి ఇంటర్వ్యూ మినహాయింపు ఉండదు. పూర్తి వివరాలకు https://in.usembassy.gov/visas/ వెబ్ సైట్ ను పరిశీలించాలి.