Boy died after being hit by MP’s car: ఎంపీ కారు ఢీకొని బాలుడు మృతి-six year old boy killed after being hit by mp car in west bengal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Six Year Old Boy Killed After Being Hit By Mp Car In West Bengal

Boy died after being hit by MP’s car: ఎంపీ కారు ఢీకొని బాలుడు మృతి

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 17, 2022 07:00 AM IST

Boy died after being hit by MP’s car: తృణమూల్ కాంగ్రెస్‍కు చెందిన ఎంపీ అబూ తాహేర్ ఖాన్‍కు చెందిన కారు ఢీకొని ఆ బాలుడు మృతి చెందాడు.

ఎంపీ కారు ఢీకొని బాలుడు మృతి
ఎంపీ కారు ఢీకొని బాలుడు మృతి (PTI)

Boy died after being hit by MP’s car: పార్లమెంటు సభ్యుడి (ఎంపీ)కి చెందిన కారు ఢీకొట్టటంతో ఆరు నెలల బాలుడు మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‍ (West Bengal) లో జరిగింది ఈ ఘటన. హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఆ పిల్లాడిని కారు ఢీకొనింది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందాడు.

ట్రెండింగ్ వార్తలు

చిన్నారిని ఢీకొన్న ఆ కారు పశ్చిమ బెంగాల్‍లోని ముర్షిదాబాద్ ఎంపీ అబు తాహేర్ ఖాన్‍ (Abu Taher Khan) కు చెందినది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఎంపీ ఆయన. ముర్షిదాబాద్‍లోని పిప్‍డేఖలీ బజార్‍లో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన చిన్నారిని హసీమ్ సర్కార్‍గా గుర్తించారు.

తల్లితో కలిసి బుధవారం ఆ పిల్లాడు బయటికి వెళ్లాడు. ఓ పని నిమిత్తం బ్యాంకులోకి ఆమె వెళ్లారు. అయితే హసీమ్ ఆ సమయంలో తల్లికి చెప్పకుండా రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో ఎంపీ ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఆ పిల్లాడిని ఢీకొట్టింది.

Boy died after being hit by MP’s car: ఆసుపత్రికి తీసుకెళ్లిన ఎంపీ

కారు ఢీకొట్టిన వెంటనే ఆ పిల్లాడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎంపీ ఖాన్. “ఆ బాలుడు హఠాత్తుగా మా కారు ముందుకు వచ్చాడు. చిన్న పిల్లాడు. ఐదు లేదా ఆరు సంవత్సరాలు ఉంటాయి. అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చాం. నా ముందే ఇదంతా జరిగింది” అని ఆసుపత్రి బయట విలేకరులతో ఎంపీ ఖాన్ వెల్లడించారు.

సుమారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తున్న సమయంలో ఆ పిల్లాడు హఠాత్తుగా కారు ముందుకు వెళ్లాడని ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు వెల్లడించారు. చిన్నారి మృతి చెందటంతో అతడి తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు.

“ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఎంపీ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ బాలుడు మృతి చెందాడు. కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశాం. కారును సీజ్ చేశాం. కేసు నమోదు చేశాం” అని ముర్షిదాబాద్‍ జిల్లాకు చెందిన ఓ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు.

బాలుడి అంత్యక్రియలకు గురువారం తాను హాజరవుతానని, ఆ పిల్లాడి తల్లిదండ్రులను కలుస్తానని రిపోర్టర్లకు ఎంపీ తాహేర్ ఖాన్ చెప్పారు.

IPL_Entry_Point