Mumbai Fire accident : ముంబైలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి!
Mumbai Fire accident : ముంబైలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 51మంది గాయపడ్డారు.
Mumbai Fire accident : ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోరేగావ్‌లోని ఓ 7 అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 51మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పశ్చిమ్ ఆజాద్ నగర్ ప్రాంతంలోని జయ భవాని బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారలు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సైతం అక్కడి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు కృషి చేసింది.
Mumbai fire accident today : ఈ ఘటనలో మరణించిన ఏడుగురిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో 12మంది పురుషులు, 28మంది మహిళలతో పాటు ఒక మైనర్ ఉన్నట్టు సమాచారం. ఆసుపత్రిలో ప్రస్తుతం 35మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థిత విషమంగా ఉంది.
కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.. అయితే.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందని ఓ స్థానికుడు తెలిపాడు.
Mumbai fire accident death toll : "మా అత్త చనిపోయారు. మా కుటుంబసభ్యులు ఆసుపత్రిలో ఉన్నారు. అర్ధరాత్రి 1:30లకు షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు చెలరేగాయి. 7వ అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి," అని ఓ వ్యక్తి తెలిపాడు.
కాగా.. మంటలు అంటుకున్న కొన్ని నిమిషాల్లోనే.. అవి భవనం మొత్తానికి వ్యాపించాయని, కింద ఉన్న దుకాణాలు, చెత్త, కార్లను కూడా విడిచిపెట్టలేదని సమాచారం.
ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు.
"గోరేగావ్ ఘటనలో ప్రజలు మరణించారన్న వార్త విని బాధ కలిగింది. బీఎంసీ, ముంబై పోలీసు అధికారులతో టచ్‌లో ఉన్నాము. అన్ని విధాలుగా సాయం చేస్తాము. మరణించిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము," అని దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు.
సంబంధిత కథనం