USA News: కిడ్నాపర్ నుంచి కొడుకును కాపాడడానికి సాహసం చేసి ప్రాణాలొదిలిన తల్లి-single mom dies after jumping in front of own car to save son 6 from carjacker ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Usa News: కిడ్నాపర్ నుంచి కొడుకును కాపాడడానికి సాహసం చేసి ప్రాణాలొదిలిన తల్లి

USA News: కిడ్నాపర్ నుంచి కొడుకును కాపాడడానికి సాహసం చేసి ప్రాణాలొదిలిన తల్లి

HT Telugu Desk HT Telugu

USA News: తన ఆరేళ్ల కుమారుడిని కిడ్నాపర్ నుంచి రక్షించుకునేందుకు ఒక తల్లి ఆ కిడ్నాపర్ వెళ్తున్న కారు ముందు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆ తల్లి చనిపోయింది. కానీ, తన కొడుకును కాపాడుకోగలిగింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఆ కిడ్నాపర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కుమారుడు డెలుకా తో అలెక్సా స్టాక్లీ (Columbus Division of Police)

USA News: ఒహాయో కు చెందిన ఒంటరి తల్లి తన ఆరేళ్ల కుమారుడు డెలుకాను కిడ్నాపర్ నుంచి కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది. తన కుమారుడిని తీసుకుని తన కార్లోనే పారిపోవడానికి ప్రయత్నిస్తున్న కిడ్నాపర్ ను నియంత్రించడానికి ఆ కారు ముందు దూకేసింది. ఆ కారు వేగానికి పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై పడి తలకు తీవ్ర గాయమై, ప్రాణాలు కోల్పోయింది. కిడ్నాపర్ ఆ కారును, అందులోని బాలుడిని దగ్గర్లోని మాల్ లో వదిలేసి పారిపోయాడు.

అసలేం జరిగింది..?

అమెరికాలోని ఒహాయోకు చెందిన సింగిల్ మదర్ అలెక్సా స్టాక్లీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంటారు. ఆమె తన ఆరేళ్ల కుమారుడు డెలూకా ని దగ్గర్లోని కెనాల్ వించెస్టర్ లోని 6300 బ్లూ నోల్ డ్రైవ్ లో బేబీ సిటర్ వద్ద వదిలి వర్క్ కు వెళ్తుంటుంది. ఆ రోజు కూడా వర్క్ ముగించుకుని బేబీ సిటర్ నుంచి నిద్రపోతున్న తన కొడుకును ఎత్తుకుని తన కార్లో పడుకోబెట్టింది. అనంతరం, కొన్ని వస్తువులు తీసుకోవడం కోసం తిరిగి ఆ ఇంట్లోకి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా, కార్లో డ్రైవర్ సీట్లో ఒక అపరిచిత వ్యక్తి, వెనుక సీట్లో తన కొడుకు ఉండడం చూసింది. ఆ అపరిచితుడు తన కొడుకును కిడ్నాప్ చేస్తున్నాడని అర్థం చేసుకుని, వెంటనే వేగంగా వెళ్తున్న ఆ కారు ముందు దూకేసింది.

తలకు తీవ్ర గాయమై..

కారు వేగానికి పక్కనే ఉన్న పుట్ పాత్ పై పడి తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి వెళ్లింది. కారుతో పాటు వెళ్లిన ఆ కిడ్నాపర్ కారును, అందులోని బాలుడిని దగ్గర్లోని ఒక షాపింగ్ మాల్ వద్ద వదిలేసి పారిపోయాడు. ఆ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల వివరాలతో సరిపోలుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.