Karnataka politics: సిద్ధ రామయ్యదే కర్నాటక పీఠం!; రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం!-siddaramaiah to be karnataka cm shiva kumar unhappy with the decision party sources say ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Siddaramaiah To Be Karnataka Cm! Shiva Kumar Unhappy With The Decision, Party Sources Say

Karnataka politics: సిద్ధ రామయ్యదే కర్నాటక పీఠం!; రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం!

HT Telugu Desk HT Telugu
May 17, 2023 01:29 PM IST

Karnataka politics: కర్నాటక ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం ప్రస్తుతానికి సమసిపోయినట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, అనుభవజ్ఞుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య (Siddaramaiah) వైపునకే పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాల సమాచారం.

కేపీసీసీ చీఫ్, కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్
కేపీసీసీ చీఫ్, కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ (PTI)

Karnataka politics: కర్నాటక (Karnataka) తదుపరి ముఖ్యమంత్రిగా సీనియర్ నేత, అనుభవజ్ఞుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను (Siddaramaiah) కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధ రామయ్య (Siddaramaiah) ఎంపికపై అధికారిక ప్రకటన ఈ రోజు, మే 17 సాయంత్రం 6 గంటలకు వెలువడుతుందని, మే 18 మధ్యాహ్నం 3.30 గంటలకు కర్నాటక సీఎంగా సిద్ధ రామయ్య ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించాయి.

ట్రెండింగ్ వార్తలు

Karnataka politics: డీకే శివకుమార్ అసంతృప్తి

కర్నాటక సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై గత రెండు రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. పోటీలో ఉన్న ఇద్దరు నేతలు సిద్ధ రామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ (DK Shiva Kumar) లను ఢిల్లీకి పిలిపించింది. రాష్ట్ర సీనియర్ పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో పోటీలో ఉన్న ఇద్దరు నేతలు సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ (DK Shiva Kumar) పట్టు వీడకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. రాష్ట్రంలో పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేసిన ఆ ఇద్దరు నాయకుల్లో ఎవరిని ఎంపిక చేసినా.. మరొకరు అంగీకరించని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో, పలు ప్రత్యామ్నాయాలను పార్టీ అధిష్టానం సిద్ధ రామయ్య (Siddaramaiah) , డీకే శివకుమార్ ల ముందు ఉంచింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ ప్రత్యామ్నాయాలు ఇవే..

  • మొదటి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య, చివరి మూడేళ్లు సీఎంగా డీకే శివకుమార్ (DK Shiva Kumar)
  • ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shiva Kumar). కీలక మంత్రిత్వ శాఖల నిర్ణయం శివకుమార్ చేతికి.

అయితే, ఈ ఆప్షన్లలో వేటికి కూడా శివకుమార్ (DK Shiva Kumar) అంగీకరించలేదని, సీఎం పదవి మినహా ఏమీ వద్దని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ సిద్ధ రామయ్యకు సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే, కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతానని డీకే స్పష్టం చేసినట్లు సమాచారం.

Karnataka politics: సిద్ధూ వైపే మొగ్గు..

ఈ నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని మరింత సాగతీయడం సరికాదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం సిద్ధ రామయ్య (Siddaramaiah) వైపే మొగ్గు చూపిందని తెలుస్తోంది. దాంతో, సమావేశం నుంచి అసంతృప్తితో డీకే (DK Shiva Kumar) వెనుతిరిగారు. అక్కడ ఎదురు చూస్తున్న మీడియా ప్రశ్నలకు స్పందించకుండా వెళ్లిపోయారు. దాంతో, శివకుమార్ (DK Shiva Kumar) ను బుజ్జగించి, ఒప్పించే బాధ్యతను రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేకు, కర్నాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి, డీకేకు సన్నిహితుడు అయిన రణ్ దీప్ సూర్జేవాలాకు అప్పగించారని తెలుస్తోంది.

WhatsApp channel