SIDBI recruitment 2023: సిడ్బీ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; డిగ్రీ ఉంటే చాలు..-sidbi recruitment 2023 apply for assistant manager posts till nov 28 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sidbi Recruitment 2023: సిడ్బీ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; డిగ్రీ ఉంటే చాలు..

SIDBI recruitment 2023: సిడ్బీ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; డిగ్రీ ఉంటే చాలు..

HT Telugu Desk HT Telugu

SIDBI recruitment 2023: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (SIDBI) గ్రేడ్ 'A' (జనరల్ స్ట్రీమ్)లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం

SIDBI recruitment 2023: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (Small Industries Development Bank SIDBI) గ్రేడ్ ‘A’ (జనరల్ స్ట్రీమ్)లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 28. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sidbi.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వేకెన్సీ వివరాలు..

ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సిడ్బీ (Small Industries Development Bank SIDBI) మొత్తం 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లను భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి కనీస విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించి ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ..

దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తరువాత షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ రెండు విభాగాల్లో సాధించిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (SIDBI)లో గ్రేడ్ ‘A’ (జనరల్ స్ట్రీమ్)లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు రూ. 1100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఈ ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 175.

how to apply: ఇలా అప్లై చేయండి..

  • సిడ్బీ అధికారిక వెబ్‌సైట్‌ www.sidbi.in ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో, కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • అక్కడ కనిపిస్తున్న “SIDBI invites Applications for Recruitment of Officers in Grade ‘A’– General Stream - 2023”పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ ఫామ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • ఆ దరఖాస్తు ఫామ్‌ను పూరించండి.
  • దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • ఫామ్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింట్ తీసుకోండి.
  • Direct link to apply

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.