Shraddha murder case: ‘‘గుండెలపై కూర్చుని గొంతు నులిమి..’’-shraddhas friends say she wanted to leave aftab but couldnt ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Shraddha's Friends Say She Wanted To Leave Aftab 'But Couldn't...'

Shraddha murder case: ‘‘గుండెలపై కూర్చుని గొంతు నులిమి..’’

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 03:01 PM IST

Shraddha murder case: ఢిల్లీ మర్డర్ కేసులో తవ్విన కొద్దీ సంచలన వాస్తవాలు వెల్లడవుతున్నాయి. కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ అఫ్తాబ్ క్రూరమైన మనస్తత్వం చూసి పోలీసులే విస్తుపోతున్నారు.

అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ద వాకర్ (ఫైల్ ఫొటో)
అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ద వాకర్ (ఫైల్ ఫొటో) (HT_PRINT)

Shraddha murder case: తనతో లివిన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధ వాకర్ ను హత్య చేసి, అతి క్రూరంగా 36 ముక్కలుగా నరికి, కూల్ గా ఫ్రిజ్ లో దాచిన అఫ్తాబ్ పూనావాలాలో ఇప్పటికీ ఎలాంటి పశ్చాత్తాపం లేదని పోలీసులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Shraddha murder case: బాధ, పశ్చాత్తాపం లేవు..

ఈ సంవత్సరం మే నెలలో శ్రద్ధతో తనకు పెద్ద గొడవ జరిగిందని ఆఫ్తాబ్ పోలీసులకు వెల్లడించాడు. తనకు వేరే యువతితో సంబంధం ఉందని శ్రద్ధ అనుమానించడంతో గొడవ ప్రారంభమైందని తెలిపారు. వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో, కోపంలో ఆమె పై చేయి చేసుకున్నానన్నాడు. ఆమె కింద పడవేసి గుండెలపై కూర్చని, గొంతు నులిమి చంపేశానని ఆ కిరాతకుడు పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో తాను చేసిన దారుణంపై కనీస బాధ, పశ్చాత్తాపం కూడా అతడిలో కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.

Shraddha murder case: మొదట్లో బాగానే ఉన్నారు..

శ్రద్ధ, అఫ్తాబ్ ల కామన్ ఫ్రెండ్, ఈ దారుణం వెలుగు చూడడానికి పరోక్షంగా కారనమైన లక్ష్మణ్ నాడార్ ను పోలీసులు విచారించారు. 2018లో వారి మధ్య రిలేషన్ ప్రారంభమైందని, కానీ ఆ విషయం తమకు 2019లో శ్రద్ధ చెప్పిందని లక్ష్మణ్ వివరించాడు. మొదట్లో వారు సంతోషంగానే ఉన్నారని తెలిపాడు. మొదట్లో ముంబైలో ఒక కాల్ సెంటర్ లో, ఆ తరువాత ఒక బ్రాండెడ్ ఫిట్ నెస్ దుస్తులు అమ్మే షాపులో వారు కలిసి పని చేశారని వివరించాడు. వారి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో వేరుగా ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉన్నారన్నారు. ఆ సమయంలో వారి మధ్య గొడవలు ఏమీ లేవని, ఢిల్లీ వెళ్లిన తరువాతనే వారి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు ప్రారంభమయ్యాయని వివరించాడు.

Shraddha murder case: అఫ్తాబ్ ను వదిలేద్దామనుకున్నా.. కానీ

వారి మధ్య గొడవల గురించి 2020లో తమకు తెలిసిందని లక్ష్మణ్ వివరించాడు. అఫ్తాబ్ తనను కొడ్తున్నాడని శ్రద్ధ అప్పుడే తనకు చెప్పిందన్నారు. ‘‘దాంతో, నేను, మరో ఫ్రెండ్ రాజ్ అఫ్తాబ్ ను హెచ్చరించాం. పోలీసులకు అప్పుడే ఫిర్యాదు చేద్దామనుకున్నాం.. కానీ శ్రద్ధ వారించడంతో ఆగిపోయాం’’ అని వెల్లడించాడు. ‘‘ఆఫ్తాబ్ ను వదిలేద్దామని ఉన్నా.. వదిలేయలేకపోతున్నా’’ అని శ్రద్ధ తనకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టిందని వెల్లడించాడు.

Shraddha murder case: లక్ష్మణ్ చెప్పడం వల్లనే..

రెండు నెలలుగా తన ఫోన్ కాల్స్ కు, మెసేజెస్ కు శ్రద్ధ స్పందించడం లేదని, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేదని, ఒకసారి కాంటాక్ట్ చేయండని లక్ష్మణ్ చెప్పడం వల్లనే శ్రద్ధ తల్లిదండ్రులు అలర్ట్ అయ్యారు. శ్రద్ధను కాంటాక్ట్ చేయడానికి విఫల ప్రయత్నం చేసి, తరువాత పోలీసు రిపోర్ట్ ఇచ్చారు.

IPL_Entry_Point

టాపిక్