లివిన్ పార్ట్ నర్ శ్రద్ధ వాల్కర్ (Shraddha Walkar) ను హత్య చేసిన తరువాత ఆఫ్తాబ్ (Aaftab Poonawala) ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచిపెట్టాడు. ఆ తరువాత నెల రోజుల పాటు ఒక్కొక్కటిగా వాటిని దగ్గరలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. ,Shraddha murder case: పోలీస్ చార్జిషీట్ లో ఏముంది?ఈ కేసులో ఆరు వేల పై చిలుకు పేజీలతో ఢిల్లీ పోలీసులు చార్జిషీటును రూపొందించి కోర్టుకు సమర్పించారు. అందులో నిందితుడు ఆఫ్తాబ్ పునావాలా (Aaftab Poonawala) క్రూరత్వాన్ని, Shraddha Walkar హత్యానంతరం నిందితుడు చేసిన దారుణాలను వెల్లడించారు. అధిక ఖర్చుల గురించి, ఆఫ్తాబ్ (Aaftab Poonawala) ఇతర గర్ల్ ఫ్రెండ్స్ గురించి వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తన మాట వినకుండా శ్రద్ధ ఆమె ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లడంపై ఆఫ్తాబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ కోపంలోనే ఆమెను గొంతు నులిమి చంపేశాడు.,Shraddha murder case: గ్రైండర్ తో ఎముకలను పొడి చేసి..హత్య చేసిన తరువాత మొదట Shraddha Walkar మృతదేహాన్నిప్లాస్టిక్ సంచిలో వేసి బయట వేద్దామనుకున్నాడు Aaftab Poonawala. కానీ, దొరికిపోతానని భయపడి ప్లాన్ మార్చుకున్నాడు. ఆ మృతదేహాన్ని చాకు, సుత్తి, పెద్ద కత్తి మొదలైన ఆయుధాలను ఉపయోగించి 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో పెట్టేశాడు. ఆమె ఎముకలను గ్రైండ్ చేయడానికి స్టోన్ గ్రైండర్ వాడాడు. ఎముకలను స్టోన్ గ్రైండర్ లో వేసి పొడి చేసి దాచిపెట్టాడు. బ్లో టార్చ్ ను ఉపయోగించి ఆమె చేతి వేళ్లను కట్ చేశాడు. శ్రద్ధ వాల్కర్ (Shraddha Walkar) మొబైల్ ఫోన్ ను ముంబైలో పడేశాడు. ఈ వివరాలను పోలీసుల విచారణలో నిందితుడు ఆఫ్తాబ్ వెల్లడించాడు. పోలీసులు తమ దర్యాప్తులో శ్రద్ధ వాల్కర్ (Shraddha Walkar) కు చెందిన సుమారు 20 శరీర భాగాలను సేకరించారు. శ్రద్ధను హత్య చేసిన తరువాత (Aaftab Poonawala) తాపీగా జొమాటో నుంచి చికెన్ రోల్ ను ఆర్డర్ చేసుకుని తిన్నాడు. 2020 మే శ్రద్ధ వాల్కర్, ఆఫ్తాబ్ ముంబై నుంచి వచ్చి ఢిల్లీలో సహజీవనం ప్రారంభించారు.