Telugu News  /  National International  /  Several Trains Running Late Due To Fog Including Hyderabad New Delhi Express
పొగ మంచు కారణంగా ఉత్తర భారత దేశంలో ముందున్న దృశ్యాలు కనిపించని తీరు
పొగ మంచు కారణంగా ఉత్తర భారత దేశంలో ముందున్న దృశ్యాలు కనిపించని తీరు (Rahul Grover)

Trains delay due to fog: పొగ మంచుతో రైళ్ల రాకపోకల్లో ఆలస్యం..

29 December 2022, 9:56 ISTHT Telugu Desk
29 December 2022, 9:56 IST

Trains delay due to fog: హైదరాబాద్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు పొగ మంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని రైల్వే అధికారులు గురువారం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, కల్కా-హౌరా నేతాజీ ఎక్స్‌ప్రెస్, గయా-న్యూఢిల్లీ మహాబోధి ఎక్స్‌ప్రెస్, పూరీ-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ 1:30 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

బరౌని నుండి న్యూఢిల్లీ స్పెషల్, అయోధ్య కాంటోన్మెంట్- ఢిల్లీ ఎక్స్‌ప్రెస్, రాజ్‌గిర్-న్యూ ఢిల్లీ శ్రమజీవి ఎక్స్‌ప్రెస్, ప్రతాప్‌గఢ్-న్యూ ఢిల్లీ పద్మావత్ ఎక్స్‌ప్రెస్ 1:45 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

రాయ్‌గఢ్-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ 3:30 గంటలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.

అయితే లక్నో-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, రక్సాల్-ఆనంద్ విహార్ సద్భావన ఎక్స్‌ప్రెస్, హౌరా-న్యూఢిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్ మరియు ముజఫర్‌పూర్-ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ వరుసగా 1:15 గంటలు, 2:45 గంటలు, 2:30 గంటలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అంతకుముందు డిసెంబరు 25న కూడా లో విజిబులిటీ కారణంగా అనేక రైళ్లు ఆలస్యం అయ్యాయపి ఉత్తర రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

బుధవారం ఒక్క ఢిల్లీలోనే 100 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నగరం మళ్లీ దట్టమైన పొగమంచుతో తీవ్రమైన చలి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతోంది.

భారత వాతావరణ శాఖ ప్రకారం మొత్తం ఉత్తర భారతదేశం ప్రస్తుతం చలి, దట్టమైన పొగమంచు పరిస్థితులను చూస్తోంది.