Byju’s case: బైజూస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; లా ట్రైబ్యునల్ పై కూడా ఆగ్రహం-setback for byjus as sc restores insolvency case raps nclat for overreach ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Byju’s Case: బైజూస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; లా ట్రైబ్యునల్ పై కూడా ఆగ్రహం

Byju’s case: బైజూస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; లా ట్రైబ్యునల్ పై కూడా ఆగ్రహం

Sudarshan V HT Telugu
Oct 23, 2024 03:03 PM IST

Byju’s case: ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ కు బుధవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ పై దివాలా ప్రక్రియను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. ఈ కేసును నిలిపివేయాలన్న ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ కేసులో ఐబీసీ ప్రోటోకాల్స్ పాటించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది.

బైజూస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
బైజూస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Byju’s case: బైజూస్ పై దివాలా ప్రక్రియను నిలిపివేస్తూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి చెల్లించాల్సిన రూ.158 కోట్ల రుణాన్ని తీర్చేందుకు దివాలా చట్టం (IBC) కింద బైజూస్ సంస్థ విధివిధానాలను పాటించాలని స్పష్టం చేసింది.

బీసీసీఐతో అంగీకారం

బైజూస్, బీసీసీఐ మధ్య గతంలో అంగీకరించిన రూ .158 కోట్ల సెటిల్మెంట్ మొత్తాన్ని రుణదాతల కమిటీ (COC) నియంత్రించే ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని కోర్టు ఆదేశించింది. మధ్యంతర పరిష్కార నిపుణుడు (IRP) యథాతథ స్థితిని కొనసాగించాలని, తీర్పు వెలువడే వరకు సీఓసీ సమావేశాలను నిర్వహించవద్దని కోర్టు సెప్టెంబర్ 26న ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. బైజూస్, బీసీసీఐ లు తమ వివా పరిష్కార ప్రయత్నాలను కొనసాగించవచ్చని, అయితే, ఆ ప్రయత్నాలు ఐబీసీ నిబంధనల ప్రకారం ఐఆర్ పి, సిఒసి పర్యవేక్షణలో జరగగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎన్ సీఎల్ ఏటీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

బైజూస్ దివాలా దరఖాస్తును ఉపసంహరించుకోవడానికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసే విషయంలో ఎన్సీఎల్ఏటీ రూల్స్-2016లోని రూల్ 11 ప్రకారం ఎన్సీఎల్ఏటీ తన అంతర్గత అధికారాలను దుర్వినియోగం చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విమర్శించింది. దివాలా దరఖాస్తును ఆమోదించిన తర్వాత, రుణగ్రహీత తరఫున ఉపసంహరణ అభ్యర్థనలను దాఖలు చేసే అధికారం ఐఆర్ పికి మాత్రమే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. కేసును అంగీకరించిన తర్వాత రుణగ్రహీత వ్యవహారాలను నిర్వహించడం ఐఆర్ పి బాధ్యతగా మారుతుందని, అంటే ఏదైనా పరిష్కారం లేదా ఉపసంహరణ అభ్యర్థనలు ఐబిసిలోని సెక్షన్ 12 ఎకు అనుగుణంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

గ్లాస్ ట్రస్ట్ పిటిషన్

ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు (supreme court) ఈ తీర్పు వెలువరించింది. బైజూస్ ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న విషయాన్ని గ్లాస్ ఉదహరించింది. బైజు రవీంద్రన్ ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తుండగా, ఆయన సోదరుడు రిజు లండన్ లో ఉన్నారు. 2019లో బీసీసీఐ, బైజూస్ మధ్య స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదిరింది. దానిప్రకారం, భారత క్రికెట్ జట్టు జెర్సీలపై బైజూస్ బ్రాండింగ్ రూపొందింది. ఈ ఒప్పందాన్ని 2023 నవంబర్ వరకు పొడిగించారు.

Whats_app_banner