Yasin Malik hunger strike | యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష‌-separatist leader yasin malik on hunger strike inside delhi s tihar jail ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Separatist Leader Yasin Malik On Hunger Strike Inside Delhi's Tihar Jail

Yasin Malik hunger strike | యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష‌

HT Telugu Desk HT Telugu
Jul 23, 2022 12:07 AM IST

Yasin Malik hunger strike | క‌శ్మీర్ వేర్పాటువాద నేత, జేకేఎల్ఎఫ్ చీఫ్‌ యాసిన్ మాలిక్ జైళ్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. త‌న కేసు విచార‌ణ న్యాయంగా జ‌ర‌గ‌డం లేదని ఆరోపిస్తూ ఆయ‌న నిర‌శ‌న‌దీక్ష చేప‌ట్టారు.

యాసిన్ మాలిక్
యాసిన్ మాలిక్

Yasin Malik hunger strike ప్ర‌స్తుతం యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు నిధులను అంద‌జేస్తున్నార‌న్న నేరంపై ఆయ‌న‌కు జైలు శిక్ష విధించారు.

ట్రెండింగ్ వార్తలు

Yasin Malik hunger strike | శుక్ర‌వారం ఉద‌యం నుంచీ..

తిహార్ జైళ్లో యాసిన్ మాలిక్ శుక్ర‌వారం ఉద‌యం నుంచి నిరాహార దీక్ష చేప‌ట్టారు. త‌న సెల్‌లో నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఆయ‌న నిరాహార‌దీక్ష కొన‌సాగిస్తున్నారు. దీక్ష విర‌మించాల‌ని జైలు అధికారులు చేసిన విజ్ఞ‌ప్తిని యాసిన్ మాలిక్ తోసిపుచ్చారు.

Yasin Malik hunger strike | జేకేఎల్ఎఫ్ చీఫ్‌

జ‌మ్మూక‌శ్మీర్ ఉగ్ర సంస్థ‌ల‌కు నిధులు స‌మకూరుస్తున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై జ‌మ్మూక‌శ్మీర్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్‌ను National Investigation Agency (NIA) అధికారులు 2019 ఏప్రిల్‌లో అరెస్ట్ చేశారు. 2020లో టాడా చ‌ట్టం, ఆయుధ చ‌ట్టం, ర‌ణ్‌బీర్ పీన‌ల్ కోడ్ త‌దిత‌రాల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

Yasin Malik hunger strike | యావ‌జ్జీవ శిక్ష‌

ఈ సంవ‌త్స‌రం మే నెల‌లో ఎన్ఐఏ కోర్టు Unlawful Activities (Prevention) Actలోని ప‌లు సెక్ష‌న్ల కింద ఆయ‌న‌ను దోషిగా నిర్ధారించి, యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించారు. ప్ర‌స్తుతం ఆయ‌న తీహార్ జైళ్లో శిక్ష అనుభ‌విస్తున్నారు.

WhatsApp channel