ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అపార్ట్​మెంట్​ బిల్డింగ్.. మొత్తం 154 ఫ్లోర్లు- ధర ఎంతో తెలిస్తే షాక్​!-senna tower worlds tallest apartment building will have 154 floors living here will cost this much ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అపార్ట్​మెంట్​ బిల్డింగ్.. మొత్తం 154 ఫ్లోర్లు- ధర ఎంతో తెలిస్తే షాక్​!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అపార్ట్​మెంట్​ బిల్డింగ్.. మొత్తం 154 ఫ్లోర్లు- ధర ఎంతో తెలిస్తే షాక్​!

Sharath Chitturi HT Telugu

బ్రెజిల్​లోని సెన్నా టవర్ 1,800 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అపార్ట్​మెంట్ బిల్డింగ్​గా అవతరించనుంది. టాప్​ ఫ్లోర్లలోని రెండు అపార్ట్​మెంట్​ ధరల వివరాలు బయటకు వచ్చాయి. ధరల వివరాలు తెలిస్తే షాక్​ అవుతారు!

సెన్నా టవర్​ (sennatower.com)

బ్రెజిల్​ నిర్మించబోతున్న కొత్త భవనం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అపార్ట్​మెంట్​ బిల్డింగ్​గా చరిత్ర సృష్టించనుంది. అమెరికా న్యూయార్క్​కి చెందిన సెంట్రల్​ పార్క్​ టవర్​ పేరిట ఉన్న ఈ రికార్డును బ్రెజిల్​లోని బిల్డింగ్​ దక్కించుకోనుంది. అయితే, ఇందులోని అపార్ట్​మెంట్​ ధరలు తెలిస్తే షాక్​ అవుతారు!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అపార్ట్​మెంట్​ బిల్డింగ్​..

ఫార్ములా 1 రేసింగ్​ లెజండ్​ అయర్టన్​ సెన్నా స్ఫూర్తితో ఈ అపార్ట్​మెంట్​ బిల్డింగ్​ని రూపొందిస్తున్నారు. దీని పేరు సెన్నా టవర్​. దీని ఎత్తు 1,800 అడుగులు ఉంటుంది. మొత్తం 154 అంతస్తులు ఉంటాయి. టాప్​ ఫ్లోర్లలోని పార్టమెంట్​ల ధరలు 53 మిలియిన్​ డాలర్ల వరకు ఉంటాయి. అంటే అది రూ. 453 కోట్లు!

అపార్ట్​మెంట్​ టాప్​లో రెండు ట్రిప్లెక్స్​ పెంట్​హౌజ్​లను నిర్మిస్తున్నారు. 9700 స్క్వేర్​ ఫీట్​ విస్తీర్ణంలో ఇవి ఉంటాయి. తొలుత వీటి ధర 15.92 మిలియన్​ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు అది 53 మిలియన్​ డాలర్లకు వెళ్లిపోయింది.

యూకే ఆక్షన్​ హౌజ్​ సోథెబైస్​ ఈ అపార్ట్​మెంట్​లను విక్రయించనుంది.

ఎఫ్ 1 లెజెండ్ స్ఫూర్తితో..

మూడుసార్లు ప్రపంచ రేసింగ్ ఛాంపియన్​గా నిలిచిన అయర్టన్ సెన్నా 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రిలో 34 ఏళ్ల వయసులో దుర్మరణం పాలయ్యాడు. ఆయన మేనకోడలు, కళాకారిణి లాలల్లి సెన్నా, మోటార్ స్పోర్ట్స్ ఐకాన్ ప్రయాణానికి చిహ్నంగా టవర్ రూపకల్పనకు సహాయపడింది.

సెన్నా టవర్​లో మొత్తం 228 యూనిట్లు ఉన్నాయి. వీటిలో 204 అపార్ట్​మెంట్లు, 18 సస్పెండెడ్​ మాన్షన్స్​ ఉన్నాయి. అయితే, టవర్​లో అతి తక్కువ స్పేస్​ ఉన్న నివాసం ధర కూడా 5 మిలియన్​ డాలర్లకు తగ్గదని తెలుస్తోంది.

నిర్మాణ సంస్థ ఎఫ్​జీ ఎంప్రెడిమెంటోస్, సెన్నా కుటుంబం, బ్రెజిల్ రిటైలర్ హవాన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. 2033 నాటికి నిర్మాణం పూర్తవుతుందని అంచనా. మొత్తం పెట్టుబడి 525 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది!

మాన్​హట్టన్​లోని 'సూపర్ టోల్ ' ఆకాశహర్మ్యంలోని పెంట్​హౌజ్​ను 110 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టారు. పెంట్​హౌజ్​లో 1,400 అడుగుల ఎత్తైన భవనంలో 80 నుంచి 83 అంతస్తుల వరకు నాలుగు అంతస్తుల ఇల్లు లేదా "క్వాడ్​ప్లెక్స్" ఉంటుంది.

పెంట్​హౌజ్​ ఉన్న భవనాన్ని స్టెయిన్వే టవర్ అని పిలుస్తారు. దీనిని 2022లో నిర్మించారు. ఇది 24:1.8 ఎత్తు-వెడల్పు నిష్పత్తితో పాశ్చాత్య దేశాలలో ఎత్తైన ఆకాశహర్మ్యాలలో ఒకటిగా నిలిచింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.