Smart phone tricks : ఓల్డ్ స్మార్ట్ ఫోన్ అమ్మేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..-selling your old android phone things to do to keep your data safe ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Selling Your Old Android Phone? Things To Do To Keep Your Data Safe

Smart phone tricks : ఓల్డ్ స్మార్ట్ ఫోన్ అమ్మేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

HT Telugu Desk HT Telugu
Sep 03, 2022 03:34 PM IST

Smart phone tricks : స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నిత్యావసరం. మన సమస్త సమాచారం అందులోనే ఉంటుంది. పిన్, పాస్ వర్డ్, బ్యాంక్ ఖాతాల సమాచారం, సోషల్ మీడియా ఇన్ఫో.. ఇలా అన్ని సీక్రెట్స్ ను స్మార్ట్ ఫోన్లోనే దాచుకుంటున్నాం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Smart phone tricks : ఇప్పుడు ఎవరూ కూడా స్మార్ట్ ఫోన్ ను కనీసం రెండేళ్ల పాటు కూడా ఉపయోగించడం లేదు. కొత్త ఫీచర్ల కోసమో, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కోసమో, లేక సరదాగానో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్ కు మారడం చాలామందికి సరదా. ఆ సమయంలో పాత స్మార్ట్ ఫోన్ ను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తుంటారు. కానీ అలా అమ్మే సమయంలో ఆ ఫోన్లోని విలువైన, కీలకమైన సమాచారాన్ని బ్యాక్ అప్ చేసుకుని, ఆ ఫోన్లో నుంచి డిలీట్ చేయడం చాలా మంది మర్చిపోతుంటారు. దానివల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల మీ పాత ఫోన్ ను అమ్మేయాలని నిర్ణయించుకుంటే..

ట్రెండింగ్ వార్తలు

Smart phone tricks : ముందు ఈ పనులు తప్పనిసరిగా చేయండి..

1) డేటా బ్యాకప్

అన్నింటి కన్నా ముందుగా చేయాల్సి పని మీరు అమ్మేయాలనుకున్న ఫోన్ లోని అవసరమైన మొత్తం డేటాను వేరే డివైజ్ లోకి కానీ, క్లౌడ్ లోకి కానీ బ్యాక్ అప్ చేసుకోండి. ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫొటోలు, కాంటాక్ట్ నెంబర్లు, అవసరమైన వాట్సాప్ చాట్స్, కీలకమైన నోట్స్.. ఇలా అన్నీ బ్యాకప్ తీసుకోండి. ఇందులో మీకు గూగుల్ ఎంతో సహకరిస్తుంది. కాంటాక్ట్స్ ను మీ జీ మెయిల్ తో సింక్ చేసుకోవచ్చు. ఫొటోస్ కోసం గూగుల్ ఫొటోస్ లేదా క్లౌడ్ సేవలు వాడుకోవచ్చు.

2) ఫోన్ తో లింక్ అయి ఉన్న అకౌంట్స్

మీ ఫోన్ తో లింక్ అయి ఉన్న అన్ని అకౌంట్స్ ని ఫోన్ లో నుంచి రిమూవ్ చేయండి. వీటిలో గూగుల్ అకౌంట్, మైక్రోసాఫ్ట్ అకౌంట్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. వీటిని డిలీట్ చేయండి.

3) మైక్రో ఎస్డీ కార్డ్, సిమ్ కార్డ్ లను తీసేయండి

అమ్మేయాలనుకుంటున్న ఫోన్ నుంచి మెమొరీ కార్డ్ ను, సిమ్ కార్డ్ ను తొలగించి, వేరేగా భద్రపరుచుకోండి. ఒకవేళ వాటిని ఫోన్ లోనే ఉంచి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే.. ఆ కార్డ్స్ లోని డేటా కూడా పోయే ప్రమాదముంది.

Smart phone tricks : 4) ఫ్యాక్టరీ రీసెట్

డేటా బ్యాకప్ ను ఒకసారి సరి చూసుకోండి. అంతా సేఫ్ గా బ్యాకప్ అయిందని నిర్ధారించుకున్న తరువాత, అమ్మేయాలనుకుంటున్న ఫోన్ ను సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఇలా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల.. ఫోన్ లోని ర్యామ్, ఇతర స్టోరేజ్ క్లియర్ అవుతుంది. దాంతో, మీ ఫోన్ కొనుక్కున్న వ్యక్తి వాటిని కొత్తగా వినియోగించుకోవచ్చు.

5) శుభ్రంగా తుడిచి..

చివరగా, మీరు అమ్మేయాలనుకుంటున్న ఫోన్ కు సంబంధించి మీ వద్ద ఉన్న అన్ని యాక్సెసరీస్ ను ఒరిజినల్ బాక్స్ లో పెట్టండి. ఫోన్ ను కూడా శుభ్రంగా తుడిచి ఆ బాక్స్ లో పెట్టి, కొనుక్కున్న వ్యక్తికి అందజేయండి.

IPL_Entry_Point