SEBI Recruitment: సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
SEBI Recruitment:సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్ సైట్ sebi.gov.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు.

SEBI Recruitment:సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) లో గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్ సైట్ sebi.gov.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు.
వేకెన్సీ వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి అప్లికేషన్లను సెబీ ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 22 నుంచి ఈ పోస్ట్ లకు సెబీ అధికారిక వెబ్ సైట్ sebi.gov.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జులై 9, 2023.
అర్హత, ఎంపిక
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే, వారి వయస్సు 2023, మే 31 నాటికి 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఈ పోస్ట్ ల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 లో ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్ లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. అది ఒక్కో పేపర్ కు 100 మార్కుల చొప్పున రెండు పేపర్లుగా ఉంటుంది. ఫేజ్ 2 లో కూడా ఒక్కో పేపర్ కు 100 మార్కుల చొప్పున రెండు పేపర్లుగా ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. ఫేజ్ 3 లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఫేజ్ 1 లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల్లో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారు రూ. 1000+18% జీఎస్టీ (మొత్తం రూ. 1180) అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 +18% జీఎస్టీ (మొత్తం రూ. 118) అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.