Trump news: ట్రంప్ ప్రాణాలు కాపాడిన ఏజెంట్ కు యూఎస్ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ పదవి
Trump news: డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత భద్రతా విభాగం అధిపతి సీన్ కరన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ గా నియమించారు. గత సంవత్సరం పెన్సిల్వేనియాలో ట్రంప్ పై హత్యా యత్నం జరిగిన సమయంలో సీన్ సమయస్ఫూర్తితో ట్రంప్ ను కాపాడారు.
Trump news: అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ గా తన సెక్యూరిటీ విభాగాధిపతి సీన్ కరన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నామినేట్ చేశారు. గత ఏడాది పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ హత్యాయత్నం విఫలమైనప్పుడు ట్రంప్ ను రక్షించడంలో సహాయపడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లలో కరన్ ఒకరు.

ట్రంప్ పై హత్యా యత్నం సమయంలో..
పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ఒక బహిరంగ సభ సందర్బంగా ఓ దుండగుడు ట్రంప్ పై కాల్పులు జరపడం, బుల్లెట్ ట్రంప్ చెవిని గాయపర్చడం తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ పిడికిలి బిగించిన ఫొటోల్లో ట్రంప్ కుడివైపు ఉన్న వ్యక్తే ఏజెంట్ సీన్ కరన్. "సీన్ గొప్ప దేశభక్తుడు, అతను గత కొన్ని సంవత్సరాలుగా నా కుటుంబాన్ని రక్షిస్తున్నాడు. అందుకే యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ లోని ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు అతడు నాయకత్వం వహిస్తారని నేను నమ్ముతున్నాను" అని ట్రూత్ సోషల్ లో ట్రంప్ (donald trump) ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. పెన్సిల్వేనియాలోని బట్లర్ లో హంతకుడి బుల్లెట్ నుంచి తనను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి సీన్ కరన్ తన ధైర్యాన్ని నిరూపించుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ (usa news telugu) సీక్రెట్ సర్వీస్ ను మునుపటి కంటే బలోపేతం చేయగలడని సీన్ పై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
23 సంవత్సరాల కెరీర్
కరన్ కు సీక్రెట్ సర్వీస్ లో 23 సంవత్సరాల అనుభవం ఉంది. వారి నెవార్క్ ఫీల్డ్ ఆఫీసులో ప్రత్యేక ఏజెంట్ గా కెరీర్ ప్రారంభించాడు. అధ్యక్షుడు ట్రంప్ మొదటి పదవీకాలంలో కరన్ ప్రెసిడెన్షియల్ ప్రొటెక్టివ్ విభాగానికి అధిపతి అయ్యారు. కాగా, పెన్సిల్వేనియాలో ట్రంప్ పై హత్యాయత్నాన్ని నిరోధించడంలో చారిత్రాత్మక వైఫల్యం తర్వాత ఏజెన్సీలో సంస్కరణలు అవసరమని పేర్కొంటూ నలుగురు సభ్యుల స్వతంత్ర ప్యానెల్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ కు 52 పేజీల నివేదికను సమర్పించింది. సీక్రెట్ సర్వీస్ బ్యూరోక్రటిక్ గా, అలసత్వంగా మారిందని, ఏజెన్సీ తన మిషన్ ను నిర్వర్తించాలంటే మౌలిక సంస్కరణలు అవసరమని నివేదిక పేర్కొంది. సంస్కరణలు లేకుండా, పెన్సిల్వేనియా వంటి హత్యా ప్రయత్నాలు "మళ్ళీ జరగవచ్చు, జరుగుతాయి" అని నివేదిక పేర్కొంది.
టాపిక్