ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 6న శ్రీలంక నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు రామనవమి సందర్భంగా తన విమానం నుండి రామసేతును సందర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదే రోజు తమిళనాడులోని రామేశ్వరంలో రామసేతుపై నిర్మించిన కొత్త పంబన్ వంతెనను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
అయితే మరోవైపు కొంతమంది స్కూబా డైవర్లు నీటి అడుగున అనేక భారీ రాతి నిర్మాణాలను అన్వేషిస్తున్నట్లు చూపించే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు ఈ వీడియో రామసేతు నిర్మించిన నీటి అడుగున ఉన్న ప్రదేశం అని వైరల్ చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోకు రామ సేతువుతో ఎటువంటి సంబంధం లేదు. దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సహాయంతో రూపొందించారు. ఈ వైరల్ వీడియో bharathfx1 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో ఏఐతో క్రియేట్ చేసినట్టుగా కూడా చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను చూసినప్పుడు వైరల్ వీడియో మాదిరిగానే భారతీయ చరిత్ర, మతం, సంస్కృతికి సంబంధించిన అనేక ఏఐ జనరేటెడ్ వీడియోలు ఆ అకౌంట్‌లో ఉన్నాయి.
రామ సేతును ఆడమ్స్ బ్రిడ్జి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. పురాణాల ప్రకారం రామసేతు రామాయణానికి సంబంధించినది. లంకకు వెళ్లే సమయంలో రాముడు, వానర సైన్యం ఒక వంతెనను నిర్మించారు, దీనికి రామ సేతు అని పేరు పెట్టారు. రామసేతు సమీపంలోని రామేశ్వరంలో నేటికీ అలాంటి తేలియాడే రాళ్లను చూడవచ్చు. అయితే ఈ వంతెన మానవ నిర్మితమా? సహజసిద్ధమా? అనే దానిపై చాలా సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది.
సంబంధిత కథనం