Macallan 1926 : ఆక్షన్‌లో రూ. 22.5కోట్లకు అమ్ముడుపోయిన విస్కీ బాటిల్!
Macallan 1926 : 1926 మకాలన్ అడామీ సింగిల్ మాల్ట్ విస్కీ బాటిల్ ఆక్షన్‌కు వెళ్లింది. ఇది 2.7 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.
Macallan Adami single-malt whisky : అరుదైన 1926 మకాలన్ అడామీ సింగిల్ మాల్ట్ విస్కీ బాటిల్.. ఆక్షన్‌లో కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. లండన్ వేదికగా జరిగిన ఈ ఆక్షన్‌లో ఈ బాటిల్ ధర ఏకంగా 2.7 మిలియన్ డాలర్లు పలికింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 22.5కోట్లు.
ట్రెండింగ్ వార్తలు
భారీ ధరకు అమ్ముడుపోయిన విస్కీ బాటిల్..!
సోథెబై అనే ఆక్షన్ సంస్థ.. ఈ అరుదైన విస్కీ బాటిల్ ఆక్షన్‌ని నిర్వహించింది. ఈ మకాలన్ 1926 చాలా అరుదు. కేవలం 40 బాటిల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ విస్కీలోని లెబుల్స్ని ఇటాలియన్ పెయింటర్ వాలేరియో అడామీ డిజైన్ చేశారు.
"ఈ మకాలన్ 1926 విస్కీ బాటిల్‌ని ప్రతి ఆక్షనీర్ ఆక్షన్ చేయాలని భావిస్తాడు. కలెక్షన్స్ ఇష్టపడే ప్రతి కలెక్టర్ కొనాలని చూస్తాడు. ఈ బాటిల్ భారీ ధరకు అమ్ముడుపోవడం విస్కీ ఇండస్ట్రీకే గొప్ప విషయం," అని సోథెబైకి చెందిన జానీ ఫౌలే తెలిపారు.
Macallan 1926 : " మకాలమ్ 1926.. 6 దశాబ్దాల పాటు షెల్లీ కాస్క్స్లో ఉన్నాయి. 1986లో ఈ మకాలన్ 1926ని బాటిల్ చేశారు. 40 బాటిళ్లను విక్రయానికి ఉంచలేదు. వీటిల్లో కొన్నింటినీ.. మకాలన్ టాప్ క్లైంట్స్‌కి ఆఫర్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ఆక్షన్స్ అన్నీ రికార్డులు బ్రేక్ చేశాయి. 2018లో సర్ పీటర్ బ్లేక్ వేరియంట్, 2019లో మిచేల్ డిల్లాన్ వేరియంట్లు ఆక్షన్‌కు వచ్చాయి. ఇప్పుడు కూడా రికార్డ్ బ్రేక్ అయ్యింది," అని ఆక్షన్ చేసిన సంస్థ పేర్కొంది. 2019లో ఆక్షన్‌కు వెళ్లిన మకాలన్ బాటిల్.. 1.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.
"ఈ విస్కీకి చెందిన ఒక చిన్న చుక్కని టేస్ట్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా డ్రై ఫ్రూట్స్ ఇందులో ఉన్నాయి. కారంగా కూడా ఉంది. ఈ విస్కీ ఒక ఇంక్రెడిబుల్ ఫీల్‌ని ఇస్తుంది," అని ఫౌలే తెలిపారు.
ఈ విస్కీని బాటిల్‌ని ఇంత ధరకు ఎవరు కొన్నారు? అన్న వివరాలపై క్లారిటీ లేదు.
సంబంధిత కథనం